జల్సా రాయుడు నరేష్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా? నోరెళ్లబెడతారు!

First Published | May 13, 2023, 7:10 PM IST

నరేష్ సక్సెస్ఫుల్ యాక్టర్. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చాడు.  ఐదు దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న నరేష్ కి వందల కోట్ల ఆస్తి ఉందని ఒక అంచనా... 
 

దివంగత నటి విజయనిర్మల కొడుకైన నరేష్ బాల నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టాడు. కృష్ణ ఆయనకు స్టెప్ ఫాదర్ అవుతారు. టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సక్సెస్ఫుల్ హీరోగా హిట్ చిత్రాల్లో నటించారు. హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తాడు. నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్. ఆయన డిమాండ్ ఉన్న నటుడు. లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 
 

ఈయనకు ముగ్గురు భార్యలు. ఇద్దరితో అధికారికంగా విడిపోయారు. మూడో భార్య రమ్య రఘుపతితో వివాదం నడుస్తుంది. నరేష్ కి స్టెప్ ఫాదర్ కృష్ణ, తల్లి విజయ నిర్మల నుండి పెద్ద మొత్తంతో ఆస్తి వచ్చిందట. అలాగే ఆయన నటుడిగా కొంత సంపాదించారు. నరేష్ స్థిర చర ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందట. 


Naresh babu


ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన మళ్ళీ పెళ్లి ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో నరేష్ అసిస్టెంట్ మీకేంటి సార్ వెయ్యి కోట్ల ఫిగర్ అని డైలాగ్ చెబుతాడు. నిజ జీవితంలో నరేష్ ఆస్తుల విలువ అంచనా వేసే ఈ డైలాగ్ రాశారని తెలుస్తుంది. ఎందుకంటే మళ్ళీ పెళ్లి నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. 

మూడో భార్య రమ్య రఘుపతితో గొడవలు ఏంటీ? నటి పవిత్ర లోకేష్ అతని జీవితంలోకి ఎలా వచ్చింది? నరేష్ లైఫ్ లో కీలకంగా మారిన రమ్య రఘుపతి, పవిత్ర లోకేష్ లతో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ఇది నా బయోపిక్ కాదని నరేష్ చెబుతున్నా... ట్రైలర్, టీజర్ చూశాక ఆయన అబద్ధం చెబుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. 
 

Image: Naresh Twitter


కాబట్టి నరేష్ మన ఊహకు కూడా అందని కోటీశ్వరుడని సమాచారం. ముగ్గురు భార్యలతో నరేష్ కి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరు పెళ్లీడుకు వచ్చారు. చెప్పాలంటే దాటిపోయారు. రమ్య రఘుపతి కొడుక్కి మాత్రం ఓ పదేళ్లకు పైన ఉంటాయి. వాళ్ళను నరేష్ సరిగా పట్టించుకోరని అపవాదు కూడా ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. 

Actor Naresh


నరేష్  కుమారుల్లో  ఒకరైన నవీన్ విజయ్ కృష్ణ నటుడిగా రెండు సినిమాలు చేశాడు. అతడు ఈ మధ్య తండ్రికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఏడాది కాలంగా నరేష్ వ్యక్తిగత జీవితంలో హైడ్రామా నడుస్తుంది. నరేష్ నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేశారు. మూడో భార్య రమ్య రఘుపతి ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేశారు. రమ్య రఘుపతి ఆరోపణలకు నరేష్ స్పందించారు. ఆమె మీద ఘాటైన విమర్శలు చేశారు. ఒకరిపై మరొకరు వ్యక్తిత్వ దాడి చేసుకున్నారు. 

Actor Naresh


చెప్పాలంటే నరేష్-పవిత్ర లోకేష్-రమ్య రఘుపతి కేంద్రంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మొత్తం ఉదంతాన్ని నరేష్ మళ్ళీ పెళ్లి అనే మూవీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా కలిపి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా చేశారు.  
 

మళ్ళీ పెళ్లి రానున్న కాలంలో సంచలనాలకు, వివాదాలకు వేదిక కావడం ఖాయం. ఎమ్ ఎస్ రాజు ఈ చిత్ర దర్శకుడు. నరేష్ స్వయంగా నిర్మించారు. వనిత విజయ్ కుమార్ కీలక రోల్ చేశారు. శరత్ బాబు కృష్ణగా, జయసుధ విజయ నిర్మలగా నటించారు. మే 26న మళ్ళీ పెళ్లి విడుదల కానుంది.

Latest Videos

click me!