Vijay Devarakonda
రష్మిక మందాన టాప్ హీరోయిన్. ఈ కన్నడ భామ తెలుగులో స్టార్ గా ఎదిగింది. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్స్ ఆమె ఇమేజ్ పెంచాయి. విజయ్ దేవరకొండతో రష్మిక రెండు చిత్రాలు చేసింది. గీత గోవిందం బ్లాక్ బస్టర్ కాగా , డియర్ కామ్రేడ్ నిరాశపరిచింది.
Vijay Devarakonda
ఈ రెండు చిత్రాల్లో విజయ్, రష్మిక మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా డియర్ కామ్రేడ్ లో లిప్ కిస్సులు లాగించేశారు. రష్మిక విజయ్ దేవరకొండకు దగ్గరైంది అనేది నిజం. పలుమార్లు వీరు ముంబైలో చక్కర్లు కొడుతూ కెమెరాకు దొరికారు.
Vijay Devarakonda
అలాగే రెండు సార్లు మాల్దీవ్స్ కి వెళ్లారు. ఈ విషయం అడిగితే... స్నేహితుడితో వెకేషన్ కి వెళితే తప్పేంటని రష్మిక సమాధానం చెప్పింది. ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ట్రిప్స్ లో కూడా రష్మిక జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి.
Vijay Devarakonda
ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న వేడుకలకు కూడా రష్మిక మందానకు ఆహ్వానం ఉంటుంది. విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరరకొండ బేబీ చిత్ర ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొంది. ఇవ్వన్నీ ప్రియుడు విజయ్ కోసమే చేస్తుందనే వాదన ఉంది.
Vijay Devarakonda
తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మరోసారి విజయ్ దేవరకొండ-రష్మిక ప్రేమికులు అంటూ ప్రచారం మొదలైంది.
Vijay Devarakonda
కాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే మూవీ చేస్తున్నారు. దర్శకుడు పరుశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్నాడు. ఇక రష్మిక యానిమల్, పుష్ప 2, రైన్ బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది. ప్రొఫెషన్స్ ఇద్దరూ బిజీ. ఎఫైర్ రూమర్స్ మాత్రం ఖండిస్తూ ఉంటారు.