ఒంటినిండా దీపావళి వెలుగులు నింపుకున్న బేబమ్మ.. ట్రెడిషనల్ లుక్ లోనూ మత్తెక్కిస్తోందిగా..

First Published | Nov 12, 2023, 7:23 PM IST

‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి ఫెస్టివల్ ట్రీట్ అందించింది. బ్యూటీఫుల్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన రూపసౌందర్యంతో కట్టిపడేస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోస్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.  
 

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) రూటు మార్చుకుంది. నెట్టింట వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అందాల విందు చేస్తోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ మరింత బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది.
 

ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా కృతిశెట్టి  ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. తన అందమైన ఫొటో స్టిల్స్ కట్టిపడేస్తోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. ఇటీవల డోస్ పెంచుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. 
 


తాజాగా బ్లూ డ్రెస్ లో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ చుడీదార్ లో కృతి శెట్టి మరింత అందాన్ని సొంతం చేసుకుంది. తన రూపసౌందర్యంతో కట్టిపడేస్తోంది. అదిరిపోయే స్టిల్స్ తో అభిమానులతో పాటు నెటిజన్లనూ కట్టిపడేస్తోంది. 
 

మరోవైపు పండగపూట గ్లామర్ విందు చేసింది. కెమెరాకు క్లోజ్ గా అందాలను ఆరబోస్తూ మంత్రముగ్థులను చేసింది. మైమరిపించే సొగసుతో నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేసింది. అభిమానులు కూడా ఈ బ్యూటీ సొగసును పొగుడుతూ ఎంకరేజ్ చేస్తోంది.
 

ఈ ఫొటోలను పంచుకుంటూ కృతి శెట్టి తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కూడా ఈ ముద్దుగుమ్మకు దీవాళి విషెస్ తెలుపుతున్నారు. తన కెరీర్ లో మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నారు. 

కృతి శెట్టి టాలీవుడ్ హ్యాట్రిక్ బ్యూటీ గా ముద్ర వేసుకుంది. ఎంట్రీతోనే వరుస హిట్లతో దుమ్ములేపించింది. లక్కీ హీరోయిన్ గా కొన్నాళ్ల పాట తెలుగు పరిశ్రమలో వెలుగొందింది.  ప్రస్తుతం మాత్రం పరిస్థితి అలా లేదు. మరో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. 
 

‘ఉప్పెన’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలతో మొదటి హ్యాట్రిక్ అందుకుంది. కానీ ఆవెంటనే హ్యాట్రిక్ డిజాస్టర్లు తాకాయి. ‘ది వారియర్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచెర్ల నియోజకవర్గం’ చిత్రాలతో డిజార్లు అందుకుంది. 
 

చివరిగా నాగచైతన్యతో వచ్చిన ‘కస్టడీ’తో అలరించింది. ప్రస్తుతం మలయాళంలో ‘అజాయంతే రందం మోషణం’, ‘జీనీ’, ‘కార్తీ26’, ‘శర్వా35’లో నటించింది. ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. 

Latest Videos

click me!