దీపాల కాంతుల్లో వెలిగిపోతున్న అనుపమా.. బ్యూటీఫుల్ శారీలో కట్టిపడేస్తున్న ‘టిల్లు’ హీరోయిన్

First Published | Nov 12, 2023, 9:31 PM IST

మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ పండగపూట సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. దీపాలను వెలిగించి వేడుక జరుపుకుంది. తాజాగా పంచుకున్న ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి. 
 

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)  సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటుంది. పండుగలు, ప్రత్యేకమైన రోజుల్లో ట్రెడిషనల్ లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. 
 

ఈరోజు దీపావళి కావడంతో మలయాళ ముద్దుగుమ్మ సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. బ్యూటీఫుల్ శారీలో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. చీరకట్టులో అనుపమా కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. పద్ధతిగా మెరిసి మంత్రముగ్ధులను చేసింది. 
 


తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు చిత్రాలతోనూ మంచి గుర్తింపు పొందిన ఈ భామ తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. అటు ఫ్యాన్స్ కూడా విషెస్ తెలుపుతున్నారు.
 

దీపావళి పండుగను కేరళ కుట్టి ఇంట్లోనే జరుపుకుంది. ఈ సందర్భంగా దీపాలను వెలిగించి ఇంటినిండా వెలుగులు నింపింది. దీపాల కాంతుల్లో అనుపమా రూపసౌందర్యం మరింతగా ప్రకాశిస్తోంది. మెరిసిపోయే అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. 

ట్రెడిషనల్ లుక్ లో మంత్రముగ్ధులను చేయడంతో పాటు.. దీపాలను చేతిలో పట్టుకొని ఫొటోలకు క్యూట్ గా ఫోజులిచ్చింది. ఓవైపు చిలిపిగా స్టిల్స్ ఇస్తూనే.. మరోవైపు సంప్రదాయాలను పాటిస్తూ ఆకట్టుకుంది. తాజాగా పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

ఇదిలా ఉంటే.. అనుపమా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగానే ఉంది. సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’, రవితేజ సరసన ‘ఈగల్’ చిత్రాల్లో నటిస్తోంది. అటు తమిళంలో ‘సైరెన్’, మలయాళంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఈ చిత్రాన్నీ ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి. 

Latest Videos

click me!