తన తప్పు ఉంటే వెంటనే క్షమాపణ చెబుతానని, అదిఎవరైనా సరే, అదే సమయంలో తనని అనవసరంగా తిడితే మాత్రం ఊరుకోనని చెప్పింది. అయితే తను వ్యక్తిగతంగా చాలా ఎమోషనల్ అని, బాధ అనిపిస్తే వెంటనే ఏడ్చేస్తానని, అది సినిమా షూటింగ్గా?, సెట్టా? ఇంకా వేరే చోటా అనేది చూడనని, ఆ ఐదు నిమిషాల్లో ఆ బాధ అంతా వెళ్లిపోవాల్సిందే అని, ఆ తర్వాత ఫ్రీ అయిపోతానని చెప్పింది రంభ. సాక్షికి కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది. ఇందులో.. తమకు స్వీట్ బిజినెస్ ఉందని, స్వీట్ తినడం ఇష్టమని, జీరో సైజ్ మెయింటేన్ చేయడం నాకు రాదని, స్వీట్ బాగా తింటానని చెప్పింది. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలతో విదేశాల్లో సెటిల్ అయ్యింది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంది రంభ.