హీరోకంటే మేం తక్కువేమి కాదు.. మరిఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారు..అంటూ వాపోతున్నారు హీరోయిన్లు. ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో.. తమ వాయిస్ వినిపిస్తున్నారు. ఈ విషయంతో స్టార్ హీరోయిర్ రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హీరో హీరోయిన్ల మధ్య రెమ్యునరేషన్ రగడ ఎప్పటి నుంచో రగులుతూనే ఉంది. హీరోలకంటే మేమేం తక్కువ. మాకెందుకు ఇంత తక్కవ రెమ్యూనరేషన్ అంటూ.. హీరోయిన్లు మొత్తుకుంటూనే ఉన్నారు. కాని వారి వాయిస్ వినేవారు లేరు. ఇక తాజాగా స్టార్ సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ విషయంలో కామెంట్స్ చేశారు.
26
Rakul Preeth Singh
హీరోలకు తామెప్పుడు తీసిపోమని..కొన్నిసందర్భంల్లో వారికంటే ఎక్కువగానే కష్టపడతామన్నారు. అయినా సరే రెమ్యూనరేషన్ విషయంలో ఆవ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారంటూ.. రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్ చేశారు. టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సాధించుకుంది రకల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోల సరసన మెరిసింది బ్యూటీ.
36
Rakul Preeth Singh
అటుతమిళంలో కూడా స్టార్ హీరోయిన్ ఇమేజ్ సాధించాలి అని ప్రయత్నించింది రకుల్ .. కాని ఏమాత్రం లాభం లేకుండా పోయింది. ఈక్రమంలో ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో.. ఇండియన్ 2 సినిమాలో కమల్ హాసన్ జోడీగా నటిస్తోంది బ్యూటీ. అటు శివకార్తికేయన్ సరసన అయిలాన్ లో నటించగా.. అది రిలీజ్ కు రెడీగా ఉంది.
46
Rakul Preeth Singh
ఇక చాలా కాలం టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది బ్యూటీ.. ప్రస్తుతం ఆమె మార్కెట్ డౌన్ అయ్యిందనే చెప్పాలి. ఈక్రమంలో.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటోంది బ్యూటీ. సమంత, నయనతార లాంటివారిని ఆదర్శంగా తీ సుకున్నట్టుంది. ఏమాత్రంతగ్గనంటోంది.
56
Rakul Preeth Singh
రీసెంట్ గా ఓ సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. రెమ్యూనరేషన్ విషయంలో.. హీరో.. హీరోయిన్ల మద్య వ్యత్యాసం చాలా ఉంటోంది అంటోంది. అంతే కాదు ప్రతిభ ఆధారంగా నిర్ణయించాల్సిన రెమ్యూనరేషన్ ను.. స్టార్ డమ్ ఆధారంగా ఇస్తున్నారననారు. ఈరకంగా హీరోలకుఎక్కువ పారితోషికం అందుతుందని.. ఈపరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు రకుల్.
66
Rakul Preeth singh hot Photos
ఇక ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించే విషయంలో.. హీరోలుమాత్రమే కాదు.. హీరోయిన్లు కూడా ప్రతిభ కలిగి ఉన్నారన్నారు రకుల్. హీరోయిన్లన చూసి కూడా సినిమాలకు వస్తున్నారన్నారు. సినిమాకు కథ, పాత్రలు అన్నీ కలిసి ప్రాణం పోయాలి.. అంతే కాని హీరో ఇమేజ్ కు అంతా క్రెడిట్ ఇచ్చేసి.. రెమ్యూనరేషన్ భారీగా అప్పగిస్తున్నారంటూ రకుల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.