ఏం వ్రతం అంటుంది దేవయాని. భార్యాభర్తలు కలిసి ఉండటానికి వ్రతం చేయించమన్నారు పంతులుగారు అందుకే చుట్టుపక్కల ఉన్న భార్యాభర్తలని పిలుస్తున్నాము అంటుంది వచ్చినావిడ. మీ ఇద్దరూ తోటి కోడళ్ళు లాగా కాకుండా సొంత అక్క చెల్లెల్లు లాగా ఉంటారు అని దేవయాని, జగతిని మెచ్చుకుంటారు వచ్చిన వాళ్ళు. బొట్టు పెట్టించుకోవటం కోసం జగతి, దేవయాని తాళిబొట్టు తీస్తారు.