ఫైర్ బ్రాండ్ అనసూయ అసలు తగ్గడం లేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సై అంటే సై అంటుంది. మాటకు మాట, కౌంటర్ కి కౌంటర్ ఇచ్చేస్తుంది. నిన్న సోషల్ మీడియా వేదికగా రెండు పోస్ట్స్ పెట్టారు. ఓ వీడియో బైట్ విడుదల చేసిన అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని చేతకాని వాళ్ళు, అదుపు తప్పారని తిట్టిపోశారు. మీడియాకు ధైర్యం ఉంటే నిజాలు రాయాలంటూ మండిపడ్డారు.