నిండైన పట్టు చీరలో నాట్య భంగిమలు... పండగ వేళ సరికొత్త అవతారంలో మెస్మరైజ్ చేసిన పూర్ణ!

First Published | Aug 31, 2022, 8:57 PM IST

వినాయక చతుర్థి వేళ పూర్ణ పట్టు చీరలో ముస్తాబయ్యారు. పదహారణాల తెలుగింటి ఆడపడుచులా అభిమానులను ముగ్దుల్ని చేశారు.

Purna

బంగారు వన్నె పట్టు చీర ధరించిన పూర్ణ నాట్య భంగిమల్లో ఫోజులిచ్చారు. గతంలో ఎన్నడూ చూపించని సరికొత్త కోణాన్ని నేడు పూర్ణ ఆవిష్కరించారు. పూర్ణలోని భారతీయతను ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. 

Purna

త్వరలో పెళ్లి చేసుకోనున్న పూర్ణ హాట్ ఫోటో షూట్స్ పక్కన పెట్టేశారు. ఆమె ఎక్కువగా సాంప్రదాయ దుస్తుల్లో ఎక్కువగా దర్శనమిస్తున్నారు.కాగా కొద్దిరోజుల క్రితం ఆమె కాబోయేవాడిని పరిచయం చేసింది.


Purna

షానిద్ అసిఫ్ అలీ వ్యక్తిని పూర్ణ పెళ్లి చేసుకోబుతుంది. చాలా మంది ఆమె స్క్రీన్ నేమ్ ఆధారంగా హిందువు అని భ్రమపడుతూ ఉంటారు. కానీ పూర్ణ ముస్లిమ్ అమ్మాయి. ఆమె అసలు పేరు షామ్నా ఖాసీం.

Purna

ఇక పూర్ణకు భర్త కానున్న షానిద్ బిజినెస్ మెన్ అని సమాచారం. అతని ప్రొఫైల్ ని బట్టి చూస్తే జేబిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ. ధనవంతుడైన వ్యాపారవేత్తను వివాహమాడి పూర్ణ లైఫ్ లో చక్కగా సెటిల్ కానుంది.

Purna

నటిగా కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూర్ణకు మంచి లైఫ్ పార్టనర్ దొరికాడు. వీరిది ప్రేమ వివాహమా లేక అరేంజ్డ్ మ్యారేజా? అనేది తెలియదు.

Purna

ఇక కెరీర్ పరిశీలిస్తే కేరళకు చెందిన పూర్ణ మలయాళ చిత్రం మంజు పోలూరు పెన్కుట్టి చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగులో ఆమె మొదటి చిత్రం శ్రీమహాలక్ష్మి. ఆమెకు సీమటపాకాయ్ మూవీతో బ్రేక్ వచ్చింది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సీమ టపాకాయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Purna


నటుడు, దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన హారర్ సిరీస్ అవును, అవును 2 చిత్రాల్లో పూర్ణ నటించారు. ఈ రెండు కూడా ఆమెకు గుర్తింపు తెచ్చాయి. అయితే తెలుగులో ఆమె హీరోయిన్ గా నిలబెట్టుకోలేకపోయారు. ఆమె కెరీర్ త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది. ప్రస్తుతం పూర్ణకు హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. 
 

Purna


ఆమె వెబ్ మూవీ 3 రోజెస్ లో ఒక హీరోయిన్ గా పూర్ణ నటించారు. ఆహా లో విడుదలైన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బా నటించారు. ఈ మూవీ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. పూర్ణకు హీరోయిన్ అవకాశాలు దాదాపు మూసుకుపోగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్స్ చేశారు. 

Purna

ఆమె స్టార్ హీరోల చిత్రాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. అఖండ మూవీ ప్రభుత్వ అధికారిణి పాత్రలో మెప్పించిన పూర్ణ, దృశ్యం 2 మూవీలో లాయర్ గా ఆకట్టుకున్నారు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ పాత్రలకు ప్రశంసలు దక్కాయి.

Purna


కొన్నాళ్లుగా పూర్ణ బుల్లితెరపై సైతం అలరిస్తున్నారు. డాన్స్ రియాలిటీ షో ఢీ 13 జడ్జిగా ఆమె వ్యవహరించారు. హీరోయిన్ పూర్ణతో పాటు జడ్జి సీట్లో కూర్చొని ఎంటర్టైన్ చేశారు. మంచిగా పర్ఫార్మ్ చేసిన డాన్స్ కంటెస్టెంట్స్ బుగ్గలు కొరుకుతూ పూర్ణ సంచలనాలకు తెరలేపారు.  మొత్తంగా పూర్ణ కెరీర్ యావరేజ్ గా సాగుతుంది. ఇక పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా నటనకు దూరం కానుందట. నెలల వ్యవధిలో వివాహ వేడుక ఉండగా ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కి కూడా సైన్ చేయకపోవచ్చు. ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ ని ఇది తీవ్రంగా నిరాశపరిచే అంశమే అని చెప్పాలి. 

Latest Videos

click me!