రోజుకు లక్షల్లో సంపాదించే స్టార్ యాంకర్ సుమ పెళ్లిచీర ధర అంత తక్కువా... ఇంతకీ ఎంత?

First Published | Aug 31, 2022, 7:58 PM IST

స్టార్ యాంకర్ సుమ పెళ్లి చీర ఖరీదు ఎంత ? ఇప్పుడిదే హాట్ టాపిక్. తాజాగా ఆమె ఈ రహస్యం వెల్లడించగా నెటిజెన్స్ భిన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. 
 

సుమ ప్రొఫైల్ ఇన్ డిటైల్ చెప్పాలంటే కష్టమే. షార్ట్ గా స్టార్ యాంకర్, తీరిక లేని జీవితం, లక్షల్లో అభిమానులు, కోట్లలో సంపాదన అని చెప్పవచ్చు. రెండు దశాబ్దాలుగా ఆమె నంబర్ వన్ పీఠం దిగలేదు. దింపేవారు రాలేదు. మరి అలాంటి సుమ పెళ్ళికి ఎంత ఖరీదైన చీర కట్టి ఉంటారు?. మాటల్లో మాటగా సుమ ఆ విషయం బయటపెట్టారు. 
 


సుమ తల్లిగారు 80వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రియమైన తల్లికి చీర కొనాలని ఓ షాపింగ్ మాల్ కి సుమ వెళ్లారు. లోపలికి వెళ్ళగానే సేల్స్ మెన్ ఇవి రూ. 15 వేల రేంజ్ చీరలు, మీ రేంజ్ చీరలో పైన ఉన్నాయి వెళ్ళండి అన్నారు. దానికి సుమ, మేము ఈ రేంజ్ చీరలో చూస్తాం అన్నారు. 
 



అనంతరం సుమకు నచ్చిన ఓ చీర ధరను అడగ్గా.. సేల్స్ మన్ రూ. 2 లక్షలు అని చెప్పాడు. ఆమ్మో రెండు లక్షలా అని ఖంగు తిన్న సుమ... నా పెళ్లి చీర ఖరీదే రూ. 11 వేలని అప్పటి విషయం బయటపెట్టింది. దీనితో సుమ పెళ్ళిలో కట్టుకున్న చీర ఖరీదు ఎంతో జనాలకు తెలిసిపోయింది. అయితే రూ. 11 వేలు చాలా చీప్ అన్నట్లు సుమ మాట్లాడారు. 
 

సుమ వివాహం జరిగింది 1999లో.. అంటే దాదాపు 23 ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడు రూ. 11 వేలు అంటే చాలా ఎక్కువ. సుమ చెప్పినట్లు చీప్ ఏమీ కాదు. నెటిజెన్స్ లో కొందరు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికి సుమ అంత ఎస్టాబ్లిష్ కూడా కాలేదు. రాజీవ్ సంపాదన కూడా అంతంత మాత్రమే. ఆ రోజుల్లోనే సుమ పెళ్లి కోసం అంత ఖర్చు పెట్టరన్న మాట.
 


నటుడు రాజీవ్ కనకాలను సుమ ప్రేమ వివాహం చేసుకున్నారు. సుమ మలయాళీ అమ్మాయి. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో రాజీవ్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే పెళ్లికి ముందు కొన్నాళ్ళు విడిపోయారట. వివాహం తర్వాత నటన వదిలేయాలని రాజీవ్ కనకాల కండీషన్ పెట్టడంతో సుమ కోప్పడ్డారట. తర్వాత ఇద్దరూ కంప్రమైజై వివాహం చేసుకున్నారు. 

ఇటీవల సుమ-రాజీవ్ విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ జంట విడాకులు తీసుకోనున్నట్లు పుకార్లు చెక్కర్లు కొట్టాయి. ఈ కథనాలను సుమ, రాజీవ్ ఖండించారు. ఓ షోలో కలిసి కనిపించి నిజం లేదని నిరూపించారు. సుమకు రోషన్, మనస్విని అనే కొడుకు, కూతురు ఉన్నారు.

Latest Videos

click me!