Priyamani
హీరోయిన్ గా రిటైర్ అయిన ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. కస్టడీ మూవీతో ఇటీవల తెలుగు ప్రేక్షకులను పలకరించింది ప్రియమణి. నాగ చైతన్య-కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. ప్రియమణి పాత్రకు మాత్రం ప్రశంసలు దక్కాయి. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కస్టడీ చిత్రాన్ని తెరకెక్కించారు.
Priyamani
ఎన్టీఆర్ దేవర చిత్రంలో ప్రియమణి నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అది కూడా ఎన్టీఆర్ తల్లి పాత్ర అట. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న క్రమంలో ప్రియమణి ఎన్టీఆర్ తల్లి, భార్య రెండు పాత్రల్లో కనిపిస్తారట.
Priyamani
మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తుంది. మోస్ట్ పాపులర్ తెలుగు డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. గత కొన్ని సీజన్స్ గా ప్రియమణి ఈ షో జడ్జిగా ఉన్నారు. షూటింగ్స్ తో బిజీ కావడంతో ప్రియమణి ఈ మధ్య ఢీ షోలో కనిపించడం లేదు.
Priyamani
కాగా ప్రియమణి వివాహం చేసుకొని ఐదేళ్లు దాటిపోయింది. ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రియమణి 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యిందన్న మాటే కానీ... ఆయన అమెరికాలో ఉంటుంటే, ప్రియమణి ఇండియాలో సినిమాలతో బిజీగా ఉన్నారు.
Priyamani
ప్రియమణి జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. పరుత్తివీరన్ చిత్రంలోని నటనకు ఆమెకు ఈ అవార్డు లభించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఆమె చిత్రాలు చేస్తున్నారు.
Priyamani
తనదైన శైలిలో అందాల విందుకు తెరలేపింది ప్రియమణి. ఆమె డ్రెస్సింగ్ మనసులు దోచేసింది. యువకుల గుండెల్లో పాగా వేసింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.