శృంగార తార సన్నీలియోన్ కి యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోర్ట్ స్టార్ గా గుర్తింపు పొందిన సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలలో రాణిస్తోంది. తన గత జీవితాన్ని పక్కన పెట్టి సన్నీలియోన్ ఇప్పుడు నటిగా రాణిస్తోంది.
బాలీవుడ్ లో సన్నీలియోన్ హైవోల్టేజ్ రొమాంటిక్ మూవీస్ లో నటిస్తూ యువతని అలరిస్తోంది. ప్రస్తుతం ఆమెకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తెలుగులో కూడా సన్నీలియోన్ కరెంట్ తీగ అనే చిత్రంలో నటించింది. గరుడ వేగ మూవీలో ఐటెం సాంగ్ చేసింది. ప్రస్తుతం సన్నీలియోన్ పలు చిత్రాల్లో నటిస్తోంది.
అంతే కాదు బోల్డ్ బ్యూటీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా బుల్లి తెరపై కూడా ఆమె ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలిసారి సన్నీలియాన్ బుల్లితెరపై మెరిసేందుకు రెడీ అయింది. హిందీలోనో ఇతర భాషలోనో కాదు ఏకంగా తెలుగు బుల్లితెర షోతో సన్నీలియోన్ యాంకర్ గా హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.
జీ నెట్వర్క్ సంస్థ జీ తెలుగులో ' తెలుగు మీడియం ఇ స్కూల్' అనే ఫన్ షోని ప్రారంభించబోతోంది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. సన్నీలియోన్ పంతులమ్మ తరహాలో చీర కట్టుకుని, కళ్ళజోడు పెట్టుకుని హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమెకి కో హోస్ట్ గా యాంకర్ రవి వ్యవహరించనున్నాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగే ఈ షోలో బుల్లితెర కమెడియన్లు సెలెబ్రిటీలు సందడి చేయబోతున్నారు.
సన్నీలియోన్ ముద్దు ముద్దుగా తెలుగులో మాట్లాడుతూ అలరిస్తోంది. 'తెలుగు నాకు జీవితాన్ని ఇచ్చింది. అందరికి నమస్కారం.. తెలుగుని ఎంటర్టైన్మెంట్ తో సెలెబ్రేట్ చేసుకుందాం.. ఇది నెవర్ బిఫోర్ రియాలిటీ షో అంటూ సన్నీలియోన్ ప్రోమోలో చెబుతున్న డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు సరిగ్గా రాణి సన్నీ లియోన్ తెలుగు షోకి యాంకర్ గా చేయడం ఏంటి.. అంతా ఆమె క్రేజ్ మహిమ అంటూ నెటిజన్లు అంటున్నారు. త్వరలోనే సన్నీలియోన్ ని తెలుగు బుల్లితెరపై చూడొచ్చు.