నవ్వులతో అభిమానుల మనసులు దోచేసిన పాయల్ రాజ్ పుత్... లేటెస్ట్ ఫోటోలు వైరల్ 

Published : Dec 11, 2023, 01:04 PM IST

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ చుడిదార్ లో పద్దతిగా తయారయ్యారు. అమ్మడు హోమ్లీ లుక్ కట్టిపడేస్తుంది. తన నవ్వులతో అభిమానులను మైమరిపిస్తోంది.   

PREV
17
నవ్వులతో అభిమానుల మనసులు దోచేసిన పాయల్ రాజ్ పుత్... లేటెస్ట్ ఫోటోలు వైరల్ 
Payal Rajput


ఒకప్పటి సీరియల్ నటి పాయల్ రాజ్ పుత్ కి ఆర్ ఎక్స్ 100 బ్రేక్ ఇచ్చింది. దర్శకుడు అజయ్ భూపతి ఓ క్రేజీ రోల్ కోసం ఆమెను ఎంపిక చేశాడు. కార్తికేయకు జంటగా ఆమె నటించిన ఆర్ఎక్స్ 100 సంచలన విజయం సాధించింది. 

27
Payal Rajput

ఆర్ఎక్స్ 100లో పాయల్ నెగిటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ చేసింది. శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. పాయల్ రాజ్ పుత్ గ్లామర్ కి కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెను ఆరాధించే ఫ్యాన్స్ ఉన్నారు. 

 

37
Payal Rajput

ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ మరలా ఆమెకు పడలేదు. దీంతో కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఆర్డీఎక్స్ లవ్ పేరుతో మరో బోల్డ్ మూవీ చేసింది. అది బాక్సాఫీస్ వద్ద వర్క్ అవుట్ కాలేదు. దర్శకుడు బాబీ తెరకెక్కించిన వెంకీ మామ చిత్రంలో పాయల్ వెంకీకి జంటగా నటించింది. నాగ చైతన్య-రాశి ఖన్నా మరో జంటగా నటించారు. 

47
Payal Rajput

వెంకీ మామ చేయకుండా ఉండాల్సిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాయల్ అన్నారు. ఇటీవల పాయల్ ఆశలన్నీ మంగళవారం మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆర్ఎక్స్ 100 దర్శకుడితో పాయల్ మరోసారి చేయి కలిపింది. 
 

57
Payal Rajput

మంగళవారం మూవీలో కూడా పాయల్ పాత్ర బోల్డ్ రోల్ చేసింది. ఒక విలక్షణ పాత్రలో ఆకట్టుకుంది.  నవంబర్ 17 విడుదలైంది. మంగళవారం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే రాంగ్ టైం లో రిలీజ్ చేయడం వలన వసూళ్లు కోల్పోయింది. 

67

తెలుగులో పాయల్ కి అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో ఆమె ఇతర చిత్ర పరిశ్రమల మీద ఫోకస్ చేస్తుంది. తమిళంలో రెండు చిత్రాలు చేస్తుంది. అక్కడైనా స్టార్ కావాలని కోరుకుంటుంది. 

 

77

కాగా చాలా కాలంగా పాయల్ రాజ్ పుత్ సౌరభ్ దింగ్రా అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. వీరిద్దరికీ సీరియల్స్ లో నటించే నాటి నుండి పరిచయం ఉంది. సౌరభ్ దింగ్రా అంటే పాయల్ కి చాలా ఇష్టం. తరచుగా సోషల్ మీడియాలో ప్రియుడిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంది...

click me!

Recommended Stories