Bigg Boss Telugu 7: తారుమారవుతున్న ఓటింగ్... టైటిల్ రేసులో ఊహించని మలుపులు!

Published : Dec 11, 2023, 12:07 PM ISTUpdated : Dec 11, 2023, 12:22 PM IST

బిగ్ బాస్ షో మరో వారం రోజుల్లో ముగియనుంది. టైటిల్ ఎవరిదనే చర్చ నడుస్తుంది. విన్నర్ ని నిర్ణయించే ఓటింగ్లో ఊహించని మలుపు చోటు చేసుకుంటున్నాయి.   

PREV
17
Bigg Boss Telugu 7: తారుమారవుతున్న ఓటింగ్... టైటిల్ రేసులో ఊహించని మలుపులు!
Bigg Boss Telugu 7

బిగ్ బాస్ తెలుగు 7 చివరి వారంలో అడుగుపెట్టింది. 14వ వారం శోభ శెట్టి ఎలిమినేట్ కాగా హౌస్లో టాప్ 6 ఉన్నారు. అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక ఫైనల్ కి వెళ్లినట్లు నాగార్జున ప్రకటించారు. 
 

27
Bigg Boss Telugu 7


గత ఆరు సీజన్స్ లో టాప్ 5 మాత్రమే ఫైనల్ కి వెళ్లారు. ఆరుగురు ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండేది. బిగ్ బాస్ తెలుగు 7లో మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదని తెలుస్తుంది. ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున ఆరుగురిని ఫైనలిస్ట్స్ గా తెలియజేశారు. 
 

37
Bigg Boss Telugu 7

14వ వారం ఆరంభంలోనే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. టైటిల్ విన్నర్ ఎవరనే చర్చ మొదలైంది. పలు మీడియా సంస్థలు నిర్వహిస్తున్న అనధికారిక ఓటింగ్ లో ఊహించని ఫలితాలు నమోదు అవుతున్నాయి. 
 

47

టాప్ లో పల్లవి ప్రశాంత్ కొనసాగుతున్నాడు. కామనర్ హోదాలో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రశాంత్ హౌస్లో అనేక విజయాలు సాధించాడు. ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 మొదటి కెప్టెన్ అయ్యాడు. 
 

57
Bigg Boss Telugu 7


పవర్ అస్త్రతో పాటు అవిక్షన్  పాస్ గెలిచాడు. తోటి కంటెస్టెంట్స్ ని గౌరవిస్తూ, ఒదిగి ఉంటూ అందరి ఫేవరేట్ అయ్యాడు. అందుకే టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి ఓటింగ్ లో సత్తా చాటుతున్నాడు. ప్రశాంత్ తర్వాత స్థానం కోసం అమర్, శివాజీ పోటీపడుతున్నారు. 
 

67

అమర్-శివాజీ మధ్య స్వల్ప ఓటింగ్ తేడా ఉన్నట్లు సమాచారం. రెండు, మూడు స్థానాల్లో అమర్, శివాజీ కొనసాగుతున్నారు. నాలుగో స్థానంలో యావర్ ఉన్నట్లు సమాచారం. ఇక ఐదవ స్థానంలో అర్జున్, ఆరవ స్థానంలో ప్రియాంక ఉన్నారట. 
 

77

ఓటింగ్ సరళి గమనిస్తే... పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఓట్లతో భారీ ఆధిక్యంతో ముందుకుపోతున్నాడు ప్రశాంత్. అయితే స్టార్ మా కప్ అమర్ కి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియా టాక్. ఇక ఏం జరుగుతుందో చూడాలి... 

 

పబ్లిక్ లో శోభ శెట్టికి చేదు అనుభవం ... వీడియో వైరల్
 

click me!

Recommended Stories