తాజాగా పూర్తి ఎపిసోడ్ బయటకు వచ్చింది. ఇందులో అసలు విషయాలు బయటపెట్టాడు నరేష్. తాను కూడా ప్రేమలో ఉన్నానని, తనకు కూడా లవర్ ఉందని, రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నట్టు చెప్పారు. ఆ అమ్మాయిని స్టేజ్‌పైకి పిలిచి అందరికి పరిచయం చేశారు. ఆమె పేరు అన్విత అని, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యిందని, ఆ తర్వాత నెంబర్లు మార్చుకోవడం, ఆ తర్వాత ప్రేమించుకోవడం వరకు వెళ్లిందన్నాడు.