పేరుకు మలయాళ అమ్మాయి కాని.. అచ్చ తెలుగు ఆడపడుచులా ఉంటుంది నిత్యామీనన్. ఆమె ఎక్కువగా అవకాశాలు సాధించింది తెలుగులోనే. మలయాళం, తమిళ్ కంటే కూడా.. తెలుగులోనే నిత్యా మీనన్ సినిమాలు ఎక్కువగా చేసింది. కానీ తెలుగులో ఆమె అసలు కనిపించకుండా పోయింది. టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగిపోయింది. నిత్య మీనన్ నటించిన సినిమాలు ఎంత రియలిస్టిక్ గా ఉంటాయో.. ఆమెకు ఉన్ ఫ్యాన్స్ బేస్ ఏంటో తెలిసిందే.