Manasa Varanasi: మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా? అసలు నిజాలు బయటపెట్టిన మానస వారణాసి

Published : Feb 12, 2026, 01:48 PM IST

మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి ఇప్పుడు `కపుల్‌ ఫ్రెండ్లీ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిచాక వచ్చే ప్రయోజనాల గురించి ఆమె ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది. 

PREV
16
కపుల్‌ ఫ్రెండ్లీ మూవీతో పలకరించబోతున్న మానస వారణాసి

మానస వారణాసి ఇప్పుడు `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీలో హీరోయిన్‌గా నటించింది. అంతకు ముందు `దేవకి నందన వాసుదేవ` చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది.  కానీ ఇది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో ఇప్పుడు `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఇందులో సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. దీనికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా గురువారం హీరోయిన్‌ మానస వారణాసి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.

26
మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నింగ్‌పై మానస కామెంట్‌

తాను 2020లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌ అయ్యింది. మిస్‌ ఇండియా వరల్డ్, మిస్‌ తెలంగాణ 2020 విన్నర్‌గా నిలిచింది. అక్కడ్నుంచి సినిమాల్లోకి వచ్చింది. అయితే మిస్‌ ఇండియాగా గెలవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి చెబుతూ, ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కోట్లల్లో వారి ప్రైజ్‌ మనీ, స్పాన్సర్లు, యాడ్స్ ఇలా భారీగా సంపాదిస్తారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో దీనిపై మానస స్పందించి క్లారిటీ ఇచ్చింది. టైటిల్‌ విన్నర్‌ అయినప్పుడు స్టేజ్‌ పై మాత్రమే చెక్‌ తీసుకుంటామని, కానీ అందులో ఒక్క రూపాయి కూడా తమ అకౌంట్‌లోకి రాదని చెప్పింది.

36
మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌ ప్రైజ్‌మనీ ఖర్చులకే

ప్రైజ్‌ మనీ మొత్తం ఏడాదిపాటు తమ మెయింటనెన్స్ కే ఖర్చు చేస్తారని తెలిపింది. హోటల్స్, జిమ్‌, ప్రోగ్రామ్స్, మేకప్‌, కాస్ట్యూమ్స్, ట్రావెలింగ్‌, సర్వీసెస్‌ వంటి వాటికి ఖర్చు చేస్తారని, తమకు వచ్చిన డబ్బులను తమకే స్పెండ్‌ చేస్తారని, అంతేకాని, అందులోనుంచి ఒక్క రూపాయి కూడా తమకు రావని చెప్పింది. స్పాన్సర్ల్, హడావుడి, రిచ్‌ లైఫ్‌, వేరే లెవల్‌ అనుకుంటారు. కానీ అలాంటిదేమీ ఉండదని తెలిపింది. మిస్‌ వరల్డ్ కి పోటీ చేస్తే, అందుకోసం డబ్బులు ఈ గెలిచిన ప్రైజ్ మనీ లోనుంచే వాడతారని పేర్కొంది. అయితే మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్ టైటిల్‌ గెలిచినప్పుడు విశేషమైన పేరు, గుర్తింపు వస్తుందని, కానీ డబ్బు పెద్దగా రాదని తెలిపింది.  గెలిచిన తర్వాత ఏడాది పాటు లైఫ్‌ వేరే లెవల్‌లో ఉంటుందని, రాయల్‌ లైఫ్‌ అనుభవిస్తామని, ఆ ఏడాది గడిచిన తర్వాత మళ్లీ రియాలిటీలోకి రావాల్సిందే అని పేర్కొంది.

46
మళ్లీ మొదట్నుంచి స్టార్ట్ చేయాల్సిందే

మిస్‌ ఇండియా విన్నర్‌ అయిన ఏడాది తర్వాత మళ్లీ జీవితాన్ని మొదట్నుంచి ప్రారంభించాల్సిందే అని తెలిపింది. అయితే ఆ పేరు, గుర్తింపు పనిచేస్తాయని పేర్కొంది. వాటిని ఉపయోగించుకుని చాలా మంది సినిమాల్లోకి వస్తుంటారని, మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్ అయిన ప్రతి ఒక్కరు సినిమాల్లోకి రారు అని, కొందరు మాత్రం సినిమాల్లోకి వస్తుంటారని పేర్కొంది. సినిమాల్లోకి వచ్చిన వారి గురించే మాట్లాడుకుంటాం, రాని వారి గురించి ఎవరూ పట్టించుకోరు. వాళ్లంతా వారికి నచ్చిన వృత్తిలో స్థిరపడిపోతారని పేర్కొంది మానస వారణాసి. అదే సమయంలో కొందరు సినిమాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో మోడలింగ్‌ వైపు వెళ్తారని, అక్కడ గుర్తింపు తెచ్చుకుని ఇందులోకి వస్తారని తెలిపింది. తాను మోడలింగ్‌లోకి వచ్చినప్పుడు సినిమాలు అనేది ఐడియా లేదని, ఆ తర్వాతనే ఇటు వైపు రావాలనిపించిందని పేర్కొంది మానస వారణాసి.

56
యూత్‌తోపాటు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే లవ్‌ స్టోరీ `కపుల్‌ ఫ్రెండ్లీ`

 `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందని, నేటి ట్రెండ్‌ని ప్రతిబింబిస్తుందని వెల్లడించింది. సినిమాలో తాము ఇద్దరం కలిసిన తీరే కొత్తగా ఉంటుందని, ఇంటెన్సిటీతో ఉంటుందని, ఇది యూత్‌కి మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంటుందని తెలిపింది. లివ్‌ ఇన్‌ రిలేషన్‌ అనేది ఎవరికి వాళ్లు ఛాయిస్‌ అని, కంఫర్ట్, నమ్మకం చాలా ముఖ్యమని తెలిపింది. 

66
సాయిపల్లవి, సమంత అంటే ఇష్టం

సినిమాల్లో సాయిపల్లవి, సమంత వంటి వారు తనని బాగా ప్రభావితం చేశారని, వారిని చూసి ఇన్‌స్పైర్‌ అయ్యానని వెల్లడించింది. తనకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని, కంటెంట్‌ ఉన్న చిత్రాలకు ప్రయారిటీ ఇస్తానని చెప్పింది. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీకి ఓకే చెప్పిందట. అలాగే తెలుగులో డిస్కషన్స్ జరుగుతున్నాయని పేర్కొంది మానస వారణాసి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories