విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా? నిజమెంత?

Published : Feb 12, 2026, 11:53 AM IST

ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ విజయ్, రష్మిక పెళ్లి. చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నఈ జంట.. ఈ నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి సరే.. వీరి రిసెప్షన్ ఎప్పుడు ఎక్కడ జరగబోతోందో తెలుసా? 

PREV
15
చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంట..

టాలీవుడ్ ఎప్పటి నుంచో రహస్యంగా ప్రేమించుకుంటున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. చాలా కాలంగా వీరు ప్రేమించుకుంటూ, డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకూ వీరిద్దరు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చింది లేదు. రీసెంట్ గా ఈ ఇద్దరూ సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఆ ఫోటోలు కానీ.. అఫీషియల్ న్యూస్ కానీ బయటకు రాలేదు. ఇక పెళ్లిపై ఎప్పుడు ప్రకటన చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

25
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ?

తాజా సమాచారం ప్రకారం, విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ ప్యాలెస్‌లో జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకలు కూడా రహస్యంగా.. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మాత్రమే నిర్వహించనున్నట్టు సమాచారం. పెళ్లి అట్టహాసంగా చేసుకోవాలి అనుకుంటే.. ఇప్పటికే ప్రకటన చేసేవారు కదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. పెళ్లి కార్యక్రమం కోసం షూటింగ్స్‌కు స్వల్ప విరామం తీసుకొని ఉదయ్‌పూర్‌కు వెళ్లనున్నట్టు సమాచారం.

35
విజయ్ - రష్మిక రిసెప్షన్ గ్రాండ్ గా..?

ఈ క్రమంలో ఈ స్టార్ లవ్ కపుల్ పెళ్లికి కొద్ది మంది సినీ సెలబ్రిటీలు హాజరయ్య అవకాశం కనిపిస్తోంది. కానీ ఇండస్ట్రీ కోసం వీరు రిసెప్షెన్ ను గ్రాండ్ గా ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. వీరి పెళ్లి ఫోటోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో రిసెప్షన్ తేదీ కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న పెళ్లి జరిగితే.. ఓ వారంలో.. అంటే మార్చి 4న కానీ.. 6న కానీ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించనున్నట్టు సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరుకానున్నట్టు టాక్.

45
ప్రేమ అలా మొదలయ్యింది..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరు గీత గోవందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అప్పుడు మొదలైన స్నేహం.. ఆతరువాత కాలంలో ప్రేమగా మారినట్టు సమాచారం. డియర్ కామ్రేడ్ సినిమా టైమ్ లో వీరి లిప్ లాక్ సంచలనంగా మారింది. అప్పటి నుంచే వీరిమధ్య సమ్ థింగ్ అన్న టాక్ గట్టిగా వినిపించింది. ఆతరువాత వీరు ఎవరి సినిమాల్లో వారు నటిస్తూ.. మధ్య, మధ్య లో రహస్యంగా రెస్టారెంట్లు, ఫారెన్ టూర్లు, డేటింగ్స్ తో.. కొన్నిసార్లు దొరికిపోయారు. కానీ ఎప్పుడు వీరి బంధం గురించి బయటపడలేదు.. డైరెక్టర్ గా స్పందించలేదు.

55
ముచ్చటగా మూడోసారి..

గతంలొ రెండు సినిమాల్లో జంటగా నటించిన విజయ్ - రష్మిక.. ముచ్చటగా మూడో సినిమాతో సందడి చేయబోతున్నారు. మరోసారి వీరు కలిసి నటిస్తున్న సినిమా రణబలి. ఈ సినిమాలో మరోసారి వీరు జంటగా కనిపించబోతున్నారు. పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకుని ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్టు సమాచారం. మరి 26న ఈజంట నిజంగా ఒక్కటవ్వబోతున్నారా? పెళ్లిపై అభిమానులకు ప్రకటన చేస్తారా ? లేక సైలెంట్ గా పెళ్లి చేసుకుని వస్తారా చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories