చిరంజీవిని ఏదో అన్నాడని నెటిజన్ కు గట్టిగా ఇచ్చిపడేసింది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఈ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈసారి డైరెక్టర్ గా వార్నింగ్ ఇచ్చింది లావణ్య. ఏమంటుందంటే?
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాటి ప్రస్తుతం పెద్దగా బయట కనిపించడంలేదు. హీరోయిన్ గా ఇండస్ట్రీలో పాపులర్ అయిన లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత కొన్ని విషయాలను పక్కన పెట్టేసింది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ గా ఉండటం లేదు లావణ్య.
ప్రస్తుతం ఆమె సినిమా ప్రమోషన్స్ ఉంటే తప్ప బయట ఎక్కువగా కనిపించడంలేదు. మెగా కోడలి హోదాను కాపాడుకుంటూ.. తన పని తాను చేసుకువెళ్తుంది. వరుణ్ తేజ్‌తో వివాహం అనంతరం, బాబు పుట్టిన తర్వాత ఆమె ప్రజల్లో మరింత అరుదుగా కనిపిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
24
చిరంజీవిపై నెటిజన్ కామెంట్లు..
ఇటీవల రామ్ చరణ్‌కు ట్విన్స్ పుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొంతమంది యాంటీ అభిమానులు చిరంజీవిని ఉద్దేశిస్తూ.. వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. మహిళలకు విలువ ఇవ్వరు, మనవరాళ్లను సరిగా చూడరని ఆరోపిస్తూ నెగిటివ్ కామెంట్లు చేశారు. ఈ తరహా విమర్శలతో ఒక వ్యక్తి ట్వీట్ చేయగా, దానికి లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించారు. ఒక రకంగా ఆ వ్యక్తికి ఇచ్చిపడేసింది లావణ్య.
34
ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి
నెటిజన్ చిరంజీవికి వ్యతిరేకంగా చేసిన ఆ ట్వీట్‌కు ప్రతిస్పందిస్తూ లావణ్య త్రిపాఠి ఇచ్చిపడేసింది. “అసలు చిరంజీవి గారు మమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా? ఆయన చేసిన దాంట్లో కొంచెం కూడా బయట చాలా మంది చేయరు. ఒక ఫ్యామిలీ మంచి ఆనంద సమయంలో ఉన్నప్పుడు వాళ్ల గురించి ఏమి తెలియకుండా ఇలా అంటావా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో స్పందించని లావణ్య ఈసారి ఫైర్ అవుతూ ట్వీట్ చేయడం.. అందరిని ఆశ్చర్యపరిచింది.
తాజాగా ‘సతీ లీలావతి’ సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ట్వీట్ గురించి ఆమెకు ప్రశ్న ఎదురయ్యింది. ఈ విషయంలో లావణ్య మాట్లాడుతూ.. “నా లైఫ్‌లో మంచి అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. అందరూ నాకు సపోర్ట్ చేశారు. కొంతమంది ఇలా ట్వీట్ చేసిన వాళ్లు కూడా ఉంటారు. ఆ ట్వీట్ గురించి స్పెషల్ గా మాట్లాడాలంటే.. ఒక ఫ్యామిలీ మంచి సెలబ్రేషన్స్‌లో ఉన్నప్పుడు అలాంటి ట్వీట్స్ ఎందుకు? అది అవసరమా? అది బ్యాడ్ ట్వీట్. ఇది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీని ఎవరైనా అంటే నాకు నచ్చదు, నేను ఊరుకోను” అని స్పష్టం చేశారు.