పెళ్లిపై హీరోయిన్ మాధవీలత ఘాటు వ్యాఖ్యలు.. నెటిజన్లపై మండిపడ్డ తార.

Published : Jun 01, 2023, 05:34 PM IST

పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది మాజీ హీరోయిన్ మాధవీ లత. అసలు పెళ్లంటే ఏంటో నెటిజన్లకు తెలిసేలే హిత బోధ చేస్తోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే..?

PREV
16
పెళ్లిపై హీరోయిన్ మాధవీలత ఘాటు వ్యాఖ్యలు.. నెటిజన్లపై మండిపడ్డ తార.

ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ తో వార్తల్లో నిలుస్తుంటుంది తెలుగు హీరోయిన్ మాధవీలత. బోల్డ్ కామెంట్స్...కాంట్రవర్సియల్ కామెంట్స్ కు ఆమె కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది మాధవీ లత. నచ్చవులే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మాధవి.. ఆతరువా వరుస ఆఫర్లు సాధించింది కాని.. హిట్లు మాత్రం తగల్లేదు మాధవీలతకు.

26

పట్టుమని పదేళ్లు కూడా ఇండస్ట్రీలో యాక్టీవ్ గా  ఉండలేక పోయింది మాధవీలత. ఇక ప్రస్తుతం కాంట్రవర్సీలకు క్లోజ్ గా ఉంటూ.. ఎప్పుడూ ఏదో ఓక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మాధవీలత. ఏదో రకంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ... సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. 

36

తాజాగా మాధవీ లత  పెళ్లిపై బోల్డ్‌ కామెంట్స్‌ చేశారు. సోషల్‌ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది మాధవీలత. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతుంటుంది. అప్పుడప్పుడు వారిపై ఫైర్ అవుతూ ఉంటుంది. తాజాగా నెటిజన్లు  కొంత మంది పెళ్లి గురించి ఆమెను పలు ప్రశ్నలు వేశారు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది.

46

పెళ్లి విషయంలో ఆమె  స్పందిస్తూ.. ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది.  ప్రియమైన సమాజం. ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వ‌య‌సు ఒక‌టే స‌రిపోదు. ఆమె శారీర‌కంగా, మాన‌సికంగా సిద్ధంగా ఉండాలి. పెళ్లి చేసుకోవ‌టం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణ‌యం అని స్పష్టం చేశారు. పెళ్లంటే ఏదో అందరూ చేసేశాం.. చూసేశాం అన్నట్టు ఉంటారు. అది కాదు పెళ్లంటే అంటూ పెళ్ళికి నిర్వచనం చెప్పింది బ్యూటీ.

56

గతంలో కూడా  మాధవీలత రకరకా కాంట్రవర్సీ కామెంట్స్ కు సెంటర్ గా నిలిచింది.బిగ్‌బాస్‌పై..హీరో నాగార్జునపై గట్టిగానే కామెంట్స్ చేసింది. గతంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు మా నాగ్ మామ అంటూ నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసిన బ్యూటీ.. బిగ్ బాస్ హౌస్‌ ముద్దులు, హగ్గులు, రొమాన్స్‌ కి అడ్డాగా మారిందని దుమ్మెత్తిపోసింది. 

66

ఇక పాన్ ఇండియా లేదు..  వన్ కంట్రీ.. వన్ ఇండస్ట్రీ అన్న పదానికి బోల్డ్ కామెంట్స్ చేసింది మాధవి. వన్ ఇండస్ట్రీ నా.. బొక్కేం కాదు… టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్‌ ని చూడరు.. నిజమైన టాలెంట్ కి స్కోప్ లేదు.. అందుకే చాలా మంది హీరోయిన్లు  తమిళ్ కి వెళ్లి అక్కడ రాణిస్తున్నారు  అన్నారు మాధవీలత. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

click me!

Recommended Stories