జిమ్ లో పూనమ్ బజ్వా హెవీ వర్కౌట్స్.. నడుమును స్ప్రింగ్ లా వంచేస్తున్న గ్లామర్ బ్యూటీ..

First Published | Jun 1, 2023, 4:54 PM IST

గ్లామర్ హీరోయిన్ పూనమ్ బజ్వా (Poonam Bajwa ) జిమ్ లో వర్కౌట్ చేస్తూ స్లిమ్ తయారయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా ఓ వీడియోను అభిమానులతో పంచుకోగా నెట్టింట వైరల్ గా మారింది.
 

నార్త్ బ్యూటీ పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. తన సినిమా అప్డేట్స్ కంటే  ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలనే అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
 

తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ ‘మొదటి సినిమా’, ‘బాస్’ చిత్రాలతో పరిచయం అయ్యింది. కింగ్, అక్కినేని నాగార్జున సరసన ‘బాస్’లో నటించిన పూనమ్ బజ్వా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇదే చిత్రంలో నయనతార కూడా అలరించింది. నయన్ కే ధీటుగా పెర్ఫామ్ చేసింది పూనమ్.


ఆ తర్వాత మరో రెండు, మూడు చిత్రాల్లో నటించి మయామైంది. ప్రస్తుతం తమిళం, ఇతర భాషల్లో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. వెండితెరపై అప్పుడప్పుడు మెరుస్తూ అలరిస్తోంది. 

కానీ, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. యోగా చేస్తూ, ఎక్సర్ సైజులు చేస్తూ కనిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు తను వ్యాయామం చేస్తున్న ఫొటోలను పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.
 

జిమ్ వేర్ లో పూనమ్ బజ్వా వర్కౌట్ చేస్తూ కనిపించింది. ఓ వర్కౌట్ మిషిన్ పై నడుమును స్పింగ్ లా వంచేస్తోంది. హెవీ వర్కౌట్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో పూనమ్ బజ్వా తన ఫిట్ నెస్ పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో అర్థం అవుతోంది. దీంతో ఆమె అభిమానులు పొగొడేస్తున్నారు. 
 

కేరీర్ విషయానికొస్తే.. తెలుగులో చివరిగా ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’ లో కీలక పాత్రలో మెరిసింది. ఆ తర్వాత తమిళం, మలయాళంలో మూడు, నాలుగు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలా ప్రాజెక్ట్ లు లేవని తెలుస్తోంది. మున్ముందు చూడాలి. 

Latest Videos

click me!