Intinti Gruhalakshmi: నందుకు చుక్కలు చూపిస్తున్న లాస్య.. దివ్యను ఇంటికి రావద్దంటూ షాకిచ్చిన నందు?

Published : Jun 12, 2023, 08:43 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కోర్టు ఆర్డర్ ని ఆయుధంలా వాడుకొని అత్తమామలకి చుక్కలు చూపిస్తున్న ఒక కోడలు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Intinti Gruhalakshmi: నందుకు చుక్కలు చూపిస్తున్న లాస్య.. దివ్యను ఇంటికి రావద్దంటూ షాకిచ్చిన నందు?

ఎపిసోడ్ ప్రారంభంలో నీరసంతో కళ్ళు మూసుకొని ఉన్న దివ్య దగ్గరికి వచ్చిన విక్రమ్ ఆమె నుదుటన ముద్దు పెడతాడు. ఎంత ధైర్యం అంటుంది దివ్య. షాకైన విక్రమ్ ఎందుకు అని అడుగుతాడు. పట్టపగలు తలుపులు తెరిచి ఉండగా ఇలా ధైర్యం చేసి ముద్దు పెట్టారు కదా అందుకు అంటుంది దివ్య. మీ అమ్మగారు తప్పు చేస్తున్నారు అన్ని సమస్యలకి పరిష్కారాన్ని ఆలోచించే ఆవిడ ఎందుకు మన ఫస్ట్ నైట్ గురించి ఆలోచించలేకపోతున్నారు అని చెప్తుంది దివ్య.

28

ఆవిడ నా మంచి కోరే మనిషి ఎప్పటికీ మనకి అన్యాయం చేయదు అంటాడు విక్రమ్. ఆవిడ మంచిది కాదని అనటం లేదు ఆవిడని ఎవరో తప్పుతోవ పట్టిస్తున్నారు అంటున్నాను కాస్త మనసుతో ఆలోచించు అంటుంది దివ్య. సరే అని చెప్పి భార్యకి సూప్ తాగిస్తాడు విక్రమ్. నాన్నని చూడాలని ఉంది దివ్య. పూజ కోసమే వెయిట్ చేసాము అయిపోయింది కదా వెళ్దాంలే అంటాడు విక్రమ్. వాళ్లిద్దరూ అలా నవ్వుతూ మాట్లాడుకోవడాన్ని చూసి భరించలేక పోతుంది రాజ్యలక్ష్మి.
 

38

సీన్ కట్ చేస్తే ఇంటికి వచ్చిన నందుకి, తులసికి దిష్టి తీయబోతుంది అనసూయ. సడన్ గా మద్యకి వస్తుంది లాస్య. దిష్టి తీయవలసింది మా ఇద్దరికీ.. కావాలనే మా కాపురంలో చిచ్చు పెట్టాలని చాలామంది చూస్తున్నారు అంటూ తులసివేపు చూస్తుంది లాస్య. సడన్గా అక్కడ లాస్యని చూసి షాక్ అవుతారు అనసూయ దంపతులు. మళ్లీ ఎందుకు దాపరించావు అంటూ అనసూయ చీదరించుకుంటుంది.
 

48

వాళ్ళిద్దరికీ కలిపి దిష్టి  తీయమని తులసి చెప్పటంతో ఇష్టం లేకపోయినా ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి తీసుకొస్తుంది అనసూయ. నేను మీ అబ్బాయి రమ్మంటే ఇక్కడికి రాలేదు మీ ఆయనతో వెళ్లి కాపురం చేసుకో అని కోర్టు తీర్పు ఇచ్చింది అని అత్తమామలకి చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోతుంది లాస్య. విషయం అర్థం కాక తెల్ల మొహం వేసిన తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్తాడు నందు.
 

58

మళ్లీ మాకు ఏంటి ఈ తల నొప్పులు అంటాడు పరంధామయ్య. ఏమో మావయ్య ఈ నెల రోజుల్లో ఎవరి మనసులు ఎలా మారుతాయో ఎవరికి తెలుసు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తులసి. సీన్ కట్ చేస్తే బాధపడుతున్న బసవయ్య దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. దివ్య ని అడగదొక్కటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే అది రివర్స్ అయి మనకే చుట్టుకుంది దానికి తోడు దివ్య వాళ్ళ నాన్న రిలీజ్ అయ్యాడు.
 

68

కూతురుకి ముక్కు మీద కోపం ఉంటే ఆ బాహుబలికి ఒళ్లంతా కోపమే ఇప్పుడు ఏం చేయటం అంటాడు బసవయ్య. ఇక్కడ అంత చేతకాని వాళ్ళు ఎవరు లేరు. ఇన్నాళ్లు విక్రమ్ దివ్యని అసహ్యించుకుంటే చాలు అనుకున్నాను కానీ విక్రమ్ జీవితంలో దివ్యని లేకుండా చేయాలి. పూజ విషయంలో ఫెయిల్ అయినంత మాత్రాన బాధపడవలసిన అవసరం లేదు అని చెప్తుంది  రాజ్యలక్ష్మి.
 

78

సీన్ కట్ చేస్తే కొడుక్కి ప్రేమగా భోజనం వడ్డిస్తూ ఉంటుంది అనసూయ. మీరు భోజనం వడ్డిస్తే భార్యగా నేనేం అయిపోవాలి ఈ నెల రోజులు నాకు చాలా కీలకమైనవి నేను నా భర్త అభిమానాన్ని సంపాదించుకోవాలి అంటుంది లాస్య. అబ్బో మొగుడు మీద పుట్టుకొచ్చింది ప్రేమ.. అయినా నా కొడుక్కి నేను ఒడ్డించుకుంటే నీకేంటి నొప్పి అంటుంది అనసూయ. మా భార్యాభర్తలని కలవనివ్వడం లేదు అని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళ్తాను అప్పుడు మీ ఇద్దరినీ జైల్లో వేస్తారు అని చెప్పి భర్తకి మరో ప్లేట్లో భోజనం వడ్డిస్తుంది లాస్య.

88

జాగ్రత్తగా ఆలోచించుకో పెట్టింది తింటే నీ తల్లిదండ్రులకే మంచిది లేదంటే వాళ్ళు తిన్నగా జైల్లో కూర్చుంటారు అంటూ భర్తని బ్లాక్మెయిల్ చేస్తుంది లాస్య. తరువాయి భాగంలో పుట్టింటికి వెళ్ళటానికి భార్య తరఫున తల్లి దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు విక్రమ్. సరిగ్గా అప్పుడే నన్ను ఫోన్ చేసి పుట్టింటికి రా వద్దంటూ ఆర్డర్ వేస్తాడు. అందరూ వెళ్ళిపోయిన తరువాత పుట్టింటి వాళ్లే రావద్దు అన్నారంటే అంతకంటే అవమానం ఏముంటుంది అంటూ దివ్యని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది రాజ్యలక్ష్మి.

click me!

Recommended Stories