ఆర్య.. తలకి దెబ్బ తగిలింది అంటాడు జెండే. ప్రాణం పోలేదు కదా జెండే అని చెప్పి బాధతో బయటికి వెళ్ళిపోతాడు ఆర్య. అతనిని అనుసరిస్తారు నీరజ్, జెండే. మరోవైపు భర్త పరిస్థితిని తలుచుకుంటూ బాధపడుతూ రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది అను. ఆమెని అనుసరిస్తుంది బామ్మ. ఇంతలో ఒక దొంగ బామ్మ చేతిలో ఉన్న బాబుని తీసుకొని పారిపోతాడు. అను చేతిలో బిడ్డని బామ్మ చేతిలో పెట్టి దొంగ వెనకాతల గట్టిగా కేకలు వేస్తూ పరిగెడుతుంది అను. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.