హీరోయిన్ కృతిశెట్టి నోట పచ్చి బూతుమాట, సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్న నెటిజన్లు

First Published | Nov 3, 2022, 8:01 PM IST

కృతి శెట్టి నోట బూతు మాట.. ఎవరైనా ఊహించగలరా..? స్టార్ హీరోయిన్.. బూతులెందుకు మాట్లాడుతుంది. అనుకుంటున్నారా..? అవును కృతిశెట్టి నోట చెప్పలేని బూతుమాట వచ్చిందట...? ఇంతకీ ఆమె ఏమన్నది.. ఎప్పుడన్నది..? 
 

కృతి శెట్టి.. ఒకే ఒక్క సినిమాతో.. టాలీవుడ్ ను ఒక ఊపు ఊపింది. వరుసగా ఆఫర్లు అందుకుంటూ.. స్టార్ హీరోల సరసన  ఛాన్స్ లు కొట్టేస్తోంది బ్యూటీ. అంతే కాదు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ తో రెచ్చిపోతుంది చిన్నది. రెండు సినిమాలతోనే గ్రిప్ తెచ్చుకుంది కృతి. 
 

కథ డిమాండ్ చేస్తే.. హాట్ హాట్ అందాలు ఆరబోయడానికి, స్పైసీ స్పైసీ సీన్స్ చేయడానికి కూడా నేను రెడీ అంటోంది కృతి శెట్టి. ఇప్పటికే శ్యామ్ సింగ్ రాయ్ లో నానీతో ఘాటు రొమాన్స్ చేసింది చిన్నది. స్టార్ హీరోల జతగా వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. 


ఉప్పెన సినిమాతో సెన్సేషన్ అయ్యింది కృతి శెట్టి. ఆతరువాత వరుస ఆఫర్లు ఆమెను వరిస్తూ వచ్చాయి. మొదట కాస్త పద్దతిగా కనిపించి కృతి శెట్టి.. స్పైసీ కంటెంట్ కు కూడా సై అనడంతో స్టార్ హీరోలు కూడా ఆమెను ఆప్షన్ గా  తీసుకుంటున్నారు.

హిందీలో సూపర్ 30 లో స్టూడెంట్ గా మొదటి సారి తేరంగేట్రం చేసింది కృతి శెట్టి. ఆ సినిమా తరువాత తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది బేబమ్మ.  ఉప్పెన తరువాత వరుసగా  శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి సినిమాల్లో నటించి హిట్ కొట్టింది బ్యూటీ. 

krithi shetty

ఈ క్రమంలోనే కృతి తన మాటల గారడితో అవకాశాలు దక్కించుకునే పనిలో బిజీగా మారింది అంటున్నారు జనాలు. అయితే రీసెంట్గా కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొరపాటున కృతి టంగ్ స్లిప్ అయ్యి ఓ బూతు పదం మాట్లాడేసింది. దీంతో పట్టేసుకున్న కోలీవుడ్ జనాలు కృతిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు 
 

యంగ్ బ్యూటీ నోట ఇలాంటి మాట హవ్వ అంటూ కృతి పరువు తీసేస్తున్నారు . నిజానికి కృతి ఆ మాట కావాలని అనింది కాదట.. పొరపాటున తన నోటి నుండి అలా వచ్చిందట. ఏది ఏమైనా సరే కృతి టైం బాలేదు అన్నదానికి ఇదో ఎగ్జాంపుల్ అని చెప్పలి..

వరుస సినిమాల్లో కనిపించిన కృతి శెట్టి ప్రస్తుతం మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.అంతే కాదు తన ఖాతాలో మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి. కొన్ని సినిమాలు పెండింగ్ లో పెట్టిందట బ్యూటీ. 
 

Latest Videos

click me!