ఐశ్వర్య రాయ్ కి షాక్ ఇచ్చిన త్రిష, వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెన్నై బ్యూటీ

Published : Nov 03, 2022, 05:43 PM IST

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కి షాక్ ఇచ్చింది త్రిష. ఇద్దరు కలిసి నటించిన పొన్నియన్ సెల్వన్ మూవీ సూపర్ హిట్ అయినా.. ఐశ్వర్య కంటే ఎక్కువగా పేరు తెచ్చుకుంది త్రిష, వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.    

PREV
16
ఐశ్వర్య రాయ్ కి షాక్ ఇచ్చిన త్రిష, వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెన్నై బ్యూటీ

పొన్నియిన్ సెల్వన్ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కలెక్షన్లతో సక్సెస్ తొ దూసుకుపోతోంది. ఐశ్వర్యా రాయ్ , త్రిష, విక్రమ్ , కార్తి లాంటి భారీ స్టార్ కాస్ట్ తో మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన మూవీ సూపర్ హిట్ అయ్యింది. అయతే ఈ సినిమాలో నటించిన స్టార్లలో కలిసొచ్చిందెవరికి.. అంటే త్రిష పేరు మాత్రమే వినిపిస్తుంది. పేరుకి విశ్వరసుందరి ఐశ్వర్యరాయ్ ఉన్నా.. ఆమెను పక్కకు నెట్టి.. త్రిష పాపులర్ అవుతోంది. 

26

మణిరత్నం మాస్టర్ పీస్ పొన్నియిన్ సెల్వన్ .. రిలీజ్ అయ్యిసూపర్ హిట్ అయ్యింది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన సినిమా దాదాపు 500కోట్ల కలెక్షన్లకు దగ్గరవుతోంది. సౌత్ లో టాప్ స్టార్ కాస్ట్ తో పాటు బాలీవుడ్ నుంచి ఐశ్వర్యరాయ్ కూడా కలిసి సినిమాకి గ్రాండ్ నెస్తెచ్చిపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కొత్తగా ఐశ్వర్యారాయ్ కేం పేరు రాలేదు .. మిగతా హీరోలకు కూడా అంతగా వచ్చిపడిన సినిమాలేం లేదు . కానీ త్రిష మాత్రం ఓ రేంజ్ లో ఛాన్సులు కొట్టేస్తోంది.

36

పొన్నియిన్ సెల్వన్ లో అందాల సుందరి ఐశ్వర్యారాయ్ ఉన్నా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదుకానీ .. అందరూ త్రిషని అలాచూస్తూ ఉండిపోయారు. ఆ అందానికి , అభినయానికి ఫిదా అయిన హీరోలు , డైరెక్టర్లు ..వరసగా ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. త్రిషకు మళ్లీ మంచిరోజులు వచ్చినట్టు తెలుస్తోంది. 40 ఏళ్లు వస్తున్నా.. హీరోయిన్ గా ఆఫర్లు రావడం అంటే మాటలు కాదు కదా.

46
trisha

పీఎస్ 1 ముందు వరకూ .. లేడీ ఓరియంటెడ్ సినిమాలుచేస్తూ..సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న త్రిష.. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్లు కొట్టుస్తోందట. ముఖ్యంగా తమిళ స్టార్ హీరోలు అయిన  అజిత్ , విజయ్ సరసన హీరోయిన్ గా త్రిష ఆఫర్ కొట్టేసిందని తెలుస్తోంది.  

56

20 ఏళ్ల క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష .. ఇంకా అదే అందంతో మెరిసిపోతోంది. యాక్టింగ్ వైజ్ నెక్ట్స్ లెవల్లో ఉన్న త్రిష .. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సెకండ్ పార్ట్ తో పాటు .. సతురంగ విట్టై 2 సినిమా చేస్తోంది. 

66

అంతేకాదు .. మళయాళంలో రామ్ సినిమా సైన్ చేసింది. లేటెస్ట్ గా అజిత్ తో మూవీ తో పాటు .. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో విజయ్ కు జంటగా త్రిష నటిస్తోందంటూ టాక్ వైరల్ అవుతోంది.
 

Read more Photos on
click me!

Recommended Stories