చాలా కాలంగా కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా ప్రేమించుకుంటున్నారు. అయితే అధికారిక ప్రకటన జరగలేదు. తమ ప్రేమ వార్తలను కియారా, సిద్ధార్థ్ ఖండించలేదు. అదే సమయంలో సమర్ధించలేదు. కాగా వారి మధ్య రిలేషన్ ఉందనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. తరచుగా కియారాతో సిద్దార్థ్ టూర్స్ కి చెక్కేస్తారు. ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలిసి పాల్గొంటారు.
సిద్దార్థ్ ఇంటికి కియారా పేరెంట్స్ వెళ్లడం అలాగే కియారా ఇంటికి సిద్దార్థ్ పేరెంట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళది కేవలం స్నేహం అంటుకుంటే పప్పులో కాలేసినట్లే. ప్రేమ వార్తలను ఖండించడక పోవడానికి కూడా కారణం వారు ప్రేమికులు కాబట్టే అంటారు.
Image: Sidharth Malhotra, Kiara AdvaniInstagram
తాజా సమాచారం ప్రకారం సిద్దార్థ్ తో కియారా పెళ్ళికి సిద్ధమయ్యారట. పెళ్ళికి ముహూర్తం, వేదిక కూడా నిర్ణయించేశారట. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిన ఈ జంట వియన్నాలో పెళ్లి చేసుకోనున్నారట. డిసెంబర్ లో ముహూర్తం ఫిక్స్ చేశారట. మరో మూడు నెలల్లో కియారా ఇంటిలో పెళ్లి భాజా మోగడం ఖాయమే అంటున్నారు.
దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ప్రస్తుతం కియారా రెండు హిందీ చిత్రాలతో పాటు రామ్ చరణ్ కి జంటగా ఆర్సీ 15 లో నటిస్తున్నారు. గతంలో చరణ్ వినయ విధేయ రామ మూవీలో కియారా నటించారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ 15 పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.
ఇక సిద్దార్థ్ థాంక్ గాడ్, యోధ, మిషన్ మజ్ను చిత్రాల్లో నటిస్తున్నారు. మిషన్ మజ్ను మూవీలో రష్మిక మందాన హీరోయిన్ కావడం విశేషం. ఇక యోధ చిత్రంలో రాశి ఖన్నా ఆయనతో జతకడుతున్నారు. కియారా, సిద్దార్థ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.