ఘట్టమనేని ఇందిరాదేవి దశదిన కర్మ.. బాలకృష్ణ, అడివి శేషు హాజరు.. కృష్ణ, మహేశ్ బాబుకు పరామర్శ!

Published : Oct 08, 2022, 06:52 PM IST

సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి గత నెలలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈరోజు ఆమె దశదిన కర్మను జరిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ, అడివి శేష్ హాజరై నివాళి అర్పించారు. కృష్ణను, మహేశ్ బాబును ఓదార్చారు.  

PREV
17
ఘట్టమనేని ఇందిరాదేవి దశదిన కర్మ..  బాలకృష్ణ, అడివి శేషు హాజరు.. కృష్ణ, మహేశ్ బాబుకు పరామర్శ!

సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (Krishna) సతీమణి, స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) కన్నతల్లి ఇందిరా దేవి (Indira Devi) గత నెల 28న అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణవార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పించారు. 
 

27

ఈరోజు దివంగత ఘట్టమనేని ఇందిరా దేవి దశదిన కర్మను  కృష్ణ గారి ఇంట్లో నిర్వహించారు. పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఇందిరా దేవికి చిత్రపటానికి కృష్ణ, మహేశ్ బాబు, నమ్రతా, కుటుంబ సభ్యులంతా పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. చివరి కార్యక్రమాల్లో భాగంగా మహేశ్ బాబు తల్లి చిత్రపటానికి నమస్కరిస్తూ భావోద్వేగితుడయ్యాడు. 
 

37

అదేవిధంగా ఇందిరా దేవి దశదిన కర్మకు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు, నటీనటులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం మహేశ్ బాబు, సూపర్ స్టార్ కృష్ణను పరామర్శించారు. వారిని ఓదార్చుతూ భరోసా వ్యక్తం చేశారు. 
 

47

తాజాగా నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) కూడా దశదిన కర్మకు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఇందిరా దేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. 

57

అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేశ్ బాబును కూడా కలిసి పరామర్శించారు. ఇందిరా దేవి లేదనే ఆలోచనలో ఇంకా కన్నీరుమున్నీరవుతున్న కృష్ణ, మహేశ్ ను బాలకృష్ణ ఓదార్చారు. కాసేపు వారితో మాట్లాడి భరోసా వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
 

67

అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh)కూడా ఇందిరా దేవి దశదిన కర్మకు హాజరయ్యారు. ఇందిరా దేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతర మహేశ్ బాబు, కృష్ణను కలిసి పరామర్శించారు. ఇందిరా దేవిని కోల్పోయినందుకు సానుభూతి వ్యక్తం చేశారు. జీఎంబీ బ్యానర్ లో మహేశ్ బాబు నిర్మాతగా అడివి శేష్ ‘మేజర్’ సినిమా చేసిన విషయం తెలిసిందే.
 

77

కార్యక్రమానికి హాజరైన సినీ ప్రముఖులు, తారలను మహేశ్ బాబు పలకరించారు. వారిచ్చిన మనోధైర్యాన్ని స్వీకరించారు. ప్రస్తుతం మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో ఆయన 28వ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెల్ ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందిరా దేవి మరణంతో పోస్ట్ పూన్ చేశారు. త్వరలో మళ్లీ ప్రారంభం కానుంది.
 

click me!

Recommended Stories