'గాడ్ ఫాదర్' నయనతారకి తెలుగులో చివరి చిత్రమా ?.. సంచలన నిర్ణయం అందుకే..

Published : Oct 08, 2022, 04:56 PM IST

ఈ ఏడాది జూన్ లో నయనతార వివాహబంధంలోకి అడుగు పెట్టింది.  తన ప్రియుడు విగ్నేష్ శివన్ తో సహజీవనానికి ఫుల్ స్టాప్ పెడుతూ అధికారికంగా పెళ్లి చేసుకుంది.

PREV
16
'గాడ్ ఫాదర్' నయనతారకి తెలుగులో చివరి చిత్రమా ?.. సంచలన నిర్ణయం అందుకే..

ఈ ఏడాది జూన్ లో నయనతార వివాహబంధంలోకి అడుగు పెట్టింది.  తన ప్రియుడు విగ్నేష్ శివన్ తో సహజీవనానికి ఫుల్ స్టాప్ పెడుతూ అధికారికంగా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం విగ్నేష్, నయనతార మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వివాహం తర్వాత నయనతార సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. 

26

అయితే నయనతార ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి చేసి ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల నయనతార తన ఫ్యామిలీ, సన్నిహితులతో మరో కోరికని కూడా బయట పెట్టిందట. నయనతార ప్రస్తుతం వయసు 37 ఏళ్ళు. అంటే దాదాపు 40 సమీపిస్తోంది. దీనితో పిల్లలని కనేందుకు కూడా ఇదే సరైన సమయం అని నయన్ భావిస్తోందట. 

36

ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని నయన్ విగ్నేష్ భావిస్తున్నారట. దీనితో సినిమాల్లో నటించడం మానేసి సొంత ప్రొడక్షన్ లో చిత్రాలని నిర్మించాలని నయనతార ప్లాన్ గా చెబుతున్నారు. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి నయనతార మాత్రమే. వయసు పెరిగేకొద్దీ ఆమె క్రేజ్ కూడా పెరుగుతోంది. 

46

నయనతార చివరగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో నటించింది. నయన్, చిరు అన్నాచెల్లెళ్లుగా నటించడం విశేషం. తెలుగులో నయన్ కి ఇదే చివరి చిత్రం అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. హిందీలో షారుఖ్ సరసన జవాన్ చిత్రంలో, తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఈ కమిట్మెంట్స్ పూర్తయ్యాక నయనతార తల్లి కావాలని భావిస్తోందట. 

56

గాడ్ ఫాదర్ చిత్రంలో ఎమోషనల్ సీన్స్ లో నయన్ చిరంజీవితో పోటీ పడి నటించింది. సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో తన పాత్రకు బలాన్ని చేకూర్చింది. ఇది పొలిటికల్ చిత్రం కావడంతో నయనతార హుందాగా అద్భుతంగా నటించింది. 

66

నయనతార తెలుగులో స్టార్ హీరోల రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. అలాంటి నయన్ సినిమాలు మానేస్తే ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ తప్పదు. తెలుగులో నయనతార ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా నయన్ సత్తా చాటింది. 

click me!

Recommended Stories