డ్రైవర్ తో ప్రేమాయణమంటూ వార్తలు, మండిపడుతున్న ఫ్యాన్స్... కీర్తితో అంత క్లోజ్ గా ఉన్న వ్యక్తి ఎవరు?

Published : Jun 22, 2023, 05:38 PM IST

కొన్నాళ్లుగా కీర్తి సురేష్ పై రూమర్స్ ఎక్కువైపోయాయి. ప్రేమ, పెళ్లి గురించి కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తితో కీర్తి సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.   

PREV
17
డ్రైవర్ తో ప్రేమాయణమంటూ వార్తలు, మండిపడుతున్న ఫ్యాన్స్... కీర్తితో అంత క్లోజ్ గా ఉన్న వ్యక్తి ఎవరు?
Keerthy Suresh


కీర్తి సురేష్ ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కీర్తి చాలా క్లోజ్ గా ఆ వ్యక్తితో మూవ్ అవుతున్నారు. ఆ ఫోటో చూస్తే ఇద్దరికీ మధ్య సాన్నిహిత్యం ఉన్నట్లుగా ఉంది. ఈ ఫోటో ఆధారంగా కథనాలు మొదలయ్యాయి. దారుణంగా ఆ వ్యక్తి కీర్తి సురేష్ డ్రైవర్, అతనికి కీర్తి దగ్గరయ్యారని పుకార్లు లేపారు. 
 

27

దీంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చింది. నిజానిజాలు తెలియకుండా వార్తలు ఎలా రాస్తారంటూ ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కీర్తి సురేష్ తో ఉన్న ఆ వ్యక్తి ఒక టెక్నీషియన్. భోళా శంకర్ సెట్స్ లో కీర్తి సురేష్ తో ఫోటోలు దిగాడట. మీడియాలో అందుకు భిన్నంగా కథనాలు రాస్తున్నారని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. 
 

37

గతంలో కీర్తి తన క్లాస్ మేట్ ని వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలను కీర్తి సురేష్ తల్లి ఖండించారు. అవన్నీ నిరాధార కథనాలన్నారు. కీర్తి ప్రస్తుతం సింగిల్. ఎవరితో రిలేషన్ లో లేదు. అలాంటిది ఏదైనా ఉంటే కీర్తి మాకు చెబుతుందని ఆమె స్పష్టత ఇచ్చారు. 
 

47
Keerthy Suresh


ఇక కీర్తి లేటెస్ట్ మూవీ దసరా సూపర్ హిట్ కొట్టింది. దసరా ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. నాని హీరోగా తెరకెక్కిన దసరా మార్చి 30న విడుదలై మంచి విజయం సాధించింది. మహానటి తర్వాత కీర్తికి ఆ స్థాయి విజయం దసరాతో దక్కింది. 
 

57

సర్కారు వారి పాట మూవీకి ముందు ఆమె బాగా స్లిమ్ అయ్యారు. చెప్పాలంటే సగానికి సగం తగ్గారు. సర్కార్ వారి పాటలో కీర్తి నుండి ఆ తరహా రోల్ ఊహించలేదు. కిలాడీ లేడీగా మహేష్ నే అల్లాడించింది.తాను ఎలాంటి షేడ్స్ ఉన్న పాత్రలైనా చేయగలనని నిరూపించింది. సోషల్ మీడియా వేదికగా కీర్తి చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ వెనుక ఆంతర్యం హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ పోగొట్టుకోవడానికే కావచ్చు. 
 

67
Keerthy Suresh

 ఒక ప్రక్కన స్టార్స్ తో చిత్రాలు చేస్తున్న కీర్తి, సిస్టర్స్ రోల్స్ చేయడం కొసమెరుపు. ఈ తరహా ప్రయోగం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. చెల్లెలు పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. 
 

77

కాగా కీర్తి ఈ మధ్య గ్లామర్ షో చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా స్కిన్ షోకి తెరలేపుతుంది. గ్లామరస్ హీరోయిన్స్ కి మైలేజ్ ఎక్కువ. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో రాణించడం అంత సులభం కాదు. అరుదుగా చాలా కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే మడిగట్టుకుని కూడా పరిశ్రమను శాసించారు. కీర్తి సురేష్ బోల్డ్ ఇమేజ్ కోరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.

click me!

Recommended Stories