పొట్టి డ్రెస్ లో రామ్ చరణ్ హీరోయిన్ అందాల రచ్చ.. థైస్ షోతో మతులు పోగొడుతున్న కియారా అద్వానీ

First Published | Jun 22, 2023, 4:25 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani)  స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. పొట్టి డ్రెస్ లో అందాలను ప్రదర్శిస్తూ చూపుతిప్పుకోకుండా చేసింది. లేటెస్ట్ పిక్స్  వైరల్ గా మారాయి. 
 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపే దక్కించుకుంది. ‘భరత్ అనే నేను’, ’వినయ విధేయ రామ’ వంటి చిత్రాలతో అలరించింది. స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్, నటనతో మెప్పించింది. స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

బాలీవుడ్ లో దాదాపు పదేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ అక్కడా తనదైన శైలిని ప్రదర్శించింది. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోలకు జోడీగా వెండితెరపై మెరిసి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది. 
 


ఇక కియారా ఈ ఏడాది పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహమాడింది. వీరిద్దరి వెడ్డింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. లైఫ్ లో సెట్ అయినప్పటికీ కెరీర్ పరంగా మాత్రం కియారా కొనసాగుతూనే ఉంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన బాలీవుడ్ చిత్రం ‘సత్య ప్రేమ్ కి కథ’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కార్తీక్ ఆర్యన్ సరసన నటించింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాలను కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కియారా కూడా సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు నెట్టింట దర్శనమిస్తోంది.
 

తాజాగా కియారా పొట్టి డ్రెస్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. మత్తెక్కించే ఫోజులతో బాలీవుడ్ భామ మతులు పోగొట్టింది. కిర్రాక్ స్టిల్స్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు థైస్ షోతో హార్ట్ బీట్ పెంచేసింది. దీంతో ఫ్యాన్స్ , నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

జూన్ 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో కియారా చురుకుగా పాల్గొంటోంది. మరోవైపు కియారా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన Game Changer లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. త్వరలో మిగితా పార్ట్ ను పూర్తి చేయనున్నారు. 
 

Latest Videos

click me!