కాజల్ చెల్లిని చూశారా ఎంత హాట్ గా ఉందో... కమ్ బ్యాక్ అంటూ బోల్డ్ ఫోటో షేర్ చేసిన నిషా అగర్వాల్!

Published : Jul 19, 2022, 05:01 PM IST

హీరోలకే కాదు హీరోయిన్స్ కి కూడా వారసత్వం ఉంటుంది. స్టార్ లేడీగా టాలీవుడ్ లో కాజల్ వెలిగిపోతున్న రోజుల్లో ఆమె చెల్లి నిషా అగర్వాల్ ఎంట్రీ ఇచ్చారు. ఒద్దుపొడుగు, అందంలో అక్కకు నిషా ఏమాత్రం తక్కువ కాదు. నిషా కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగనప్పటికీ ఒకటి రెండు హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.   

PREV
17
కాజల్ చెల్లిని చూశారా ఎంత హాట్ గా ఉందో... కమ్ బ్యాక్ అంటూ బోల్డ్ ఫోటో షేర్ చేసిన నిషా అగర్వాల్!
Nisha Agarwal


సంపత్ నంది దర్శకుడిగా పరిచయమవుతూ 2010లో ఏమైంది ఈవేళ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ చేశారు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ మూవీతో నిషా(Nisha Agarwal) హీరోయిన్ అయ్యారు. ఏమైంది ఈవేళ మంచి విజయాన్ని నమోదు చేసింది. చిన్న సినిమాగా విడుదలై లాభాలు పంచింది. 
 

27
Nisha Agarwal

అనంతరం నారా రోహిత్ కి జంటగా సోలో చేశారు. దర్శకుడు పరుశురాం తెరకెక్కించిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. సోలో సైతం ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నిషా సత్తా చాటింది. దీంతో అక్క మాదిరి సిల్వర్ స్క్రీన్ ని ఏలేస్తుందని భావించారు.

37


ఇక అక్క కాజల్ కూడా ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాజల్ ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు. 


అయితే అలా జరగలేదు. సోలో విజయం తర్వాత ఆమెకు మరో సక్సెస్ దక్కలేదు. ఆది సాయి కుమార్ కి జంటగా నటించిన సుకుమారుడు, వరుణ్ సందేశ్ తో రెండవ చిత్రం సరదాగా అమ్మాయితో ఫ్లాప్ అయ్యాయి. తమిళ,మలయాళ భాషల్లో ఒకటి రెండు చిత్రాలు చేసినా అవి కూడా బ్రేక్ ఇవ్వలేదు. 

47


కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరేలా ఉండగా నిషా అగర్వాల్ తెలివిగా పెళ్లి చేసుకొని సెటిలైంది. 2014లో ముంబైకి చెందిన గోల్డ్ వ్యాపారి కరణ్ వలేచ ను వివాహం చేసుకున్నారు.2017లో నిషా ఓ అబ్బాయికి జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత ఆమె నటనకు గుడ్ బై చెప్పారు. 
 

57
Nisha aggarwal Kajal


అయితే తాజాగా ఆమె కం బ్యాక్ ప్రకటించారు. ఇంస్టాగ్రామ్ లో ఓ హాట్ ఫోటో షేర్ చేసిన నిషా అగర్వాల్ ... వెనకడుగు కంటే పునరాగమనం చాలా బలంగా ఉంటుంది... అంటూ కామెంట్ చేసింది. బ్యాక్ టు వర్క్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. ఇక ఆమె నటిస్తున్న ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు నిషా అగర్వాల్ పొందుపరచలేదు. 

67


ఇక నిషా కం బ్యాక్ పై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వెల్కమ్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. 

77
Nisha aggarwal Kajal


మరోవైపు నిషా అక్క కాజల్(Kajal Agarwal) కూడా తల్లి అయ్యారు. ఏప్రిల్ నెలలో ఆమె నీల్ కిచ్లుకి జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత కాజల్ జోరు తగ్గించారని చెప్పాలి. ఇక అక్కా చెల్లెళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్, కెరీర్ ని చక్కగా బ్యాలన్స్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. 

click me!

Recommended Stories