‘కార్తికేయ 2’ చిత్ర యూనిట్‌కు అరుదైన గౌరవం.. ఇస్కాన్ మెయిన్ సంస్థానం ‘బృందావన్‌’కు ప్రత్యేక ఆహ్వానం..

Published : Jul 19, 2022, 04:59 PM IST

యంగ్ హీరో నిఖిల్ -  అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కార్తీకేయ 2’. ఈ మూవీ అప్డేట్స్ కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ కు  అరుదైన గౌరవం దక్కింది.   

PREV
16
‘కార్తికేయ 2’ చిత్ర యూనిట్‌కు అరుదైన గౌరవం.. ఇస్కాన్ మెయిన్ సంస్థానం ‘బృందావన్‌’కు ప్రత్యేక ఆహ్వానం..

వరుస విజయాలతో దూసుకుపోతున్నయంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) తాజాగా నటించిన చిత్రం ‘కార్తీకేయ 2’. ఈ మూవీలో గ్లామర్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ కు సిద్దమైంది. మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే అప్డేట్స్ అందిస్తూ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, పాటలకు ఆడియెన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. అంతేకాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని అభినందిస్తున్నారు. 
 

26

హీరో నిఖిల్, విలక్షణ దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న ‘కార్తికేయ 2’పై ఇప్పటికే    అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON) వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ చిత్రానికి తాజాగా అరుదైన ఆహ్వానం లభించింది. తాజాగా తమ సొసైటీ తరుపున చిత్ర యూనిట్ కు ప్రత్యేక ఆహ్వానం పలికారు. కార్తికేయ 2 చిత్రయూనిట్‌కు ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌కు రావాలంటూ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ స్వయంగా ఆహ్వానించారు. 

36

ఇస్కాన్ దేవాలయాలు కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. విదేశాల్లోనూ.. ఖండఖండాంతరాలుగా వ్యాపించి ఉన్నాయి.  ఆస్ట్రియా లాంటి దేశాల నుంచి మొదలుపెట్టి ఎన్నో వందల దేశాల్లో ఇస్కాన్ టెంపుల్స్ కొలువై ఉన్నాయి. అంతటి ప్రగ్యాతి గాంచిన ట్రస్ట్ నుంచి కార్తికేయ 2 టీమ్‌కు ఆహ్వానం లభించడం నిజంగా గర్వించదగ్గ విషయం. 
 

46

ఇప్పటి వరకు ఇతిహాసాల నేపథ్యంలో, మైథలాజికల్ స్టోరీస్‌ నేపథ్యంలో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. భారతం, భాగవతం, రామాయణాలపై సినిమాలతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సీరియల్స్ రూపొందాయి. అయితే భారతీయ సినీ చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం Karthikeya 2 చిత్ర యూనిట్ కు దక్కింది. 
 

56

కార్తికేయ 2 చిత్రం శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా వస్తుందని.. టీజర్, మోషన్ పోస్టర్‌ను చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే శ్రీ కృష్ణుడి తత్వం, ఫిలాసఫీ, ఆయన ఆరా భరతఖండంపై ఎలా ఉంది.. ఆయన బోధించిన సారాంశం ఏంటి అనేది కోర్ పాయింట్‌గా కార్తికేయ 2 సినిమా ఉండబోతుంది. 

66

గతంలో  జూలై 22న ఐదు భాషలు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మాత  చిత్రం రూపుదిద్దుకుంటోంది. దేవాలయాల్లో సందర్శించిన వారిలో హీరో నిఖిల్, శ్రీను, హర్ష, తదితరులు పాల్గొన్నారు.
 

click me!

Recommended Stories