`గోల్డ్ డిగ్గర్‌` అంటూ రెచ్చిపోయిన ట్రోలర్స్.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన సుస్మితా సేన్‌..

Published : Jul 19, 2022, 04:47 PM IST

ఐపీఎస్‌ సృష్టికర్త లలిత్‌ మోడీతో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ డేటింగ్‌ ప్రకటించడంతో వీరి జంటపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రోలర్‌ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సుస్మితా సేన్‌ స్పందిస్తూ ఘాటుగా కౌంటర్లిచ్చింది. 

PREV
18
`గోల్డ్ డిగ్గర్‌` అంటూ రెచ్చిపోయిన ట్రోలర్స్.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన సుస్మితా సేన్‌..

మాజీ విశ్వసుందరి Sushmita Sen) ఇటీవల తన డేటింగ్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోడీ(Lalit Modi)తో ఆమె ఘాటు ప్రేమలో మునిగి తేలుతుంది. యాభై ఏళ్లకు పైబడిన ఈ జంట డేటింగ్‌ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సెలబ్రిటీలంతా నోరెళ్ల బెడుతున్నారు. ఈ వయసులో డేటింగ్‌ ఏంటని ఆశ్చర్యపోతున్నారు. సుస్మితా సేన్‌ చాలా మంది బాయ్‌ ఫ్రెండ్స్ ని మార్చిన నేపథ్యంలో ఇది మరింత ఆసక్తికరంగా మారింది. 

28

మాజీ విశ్వసుందరిగా నిలిచి బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపింది సుస్మితా సేన్‌. అగ్ర హీరోలందరితోనూ నటించింది. ఆడిపాడింది. అనేక సూపర్‌ హిట్‌ చిత్రాలను అందుకుంది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గానూ నిలిచింది సుస్మితా సేన్‌. అదే సమయంలో ఆమె అనేక మందితో ఎఫైర్‌ నడిపించిందనే విమర్శలు కూడా ఉన్నాయి. పాక్‌ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌, మెడల్‌ రోహ్‌మన్‌లతోపాటు అనిల్‌ అంబాని, మరో ముగ్గురు నటులతోనూ ఆమె డేటింగ్‌ చేసినట్టు పుకార్లు వచ్చాయి. 

38

వాటిన్నింటిని పక్కన పెట్టేసి ఫ్రెష్‌గా మరో డేటింగ్‌ని స్టార్ట్ చేసిందని అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ఈ వయసులో లలిత్‌ మోడీని పెళ్లి చేసుకుంటే ఏ ప్రయోజనం అంటున్నారు. అంతేకాదు అనేక రకాలుగా కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మీమ్స్ తో ట్రోల్‌ చేస్తున్నారు. దారుణంగా విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే లలిత్‌ మోడీ స్పందించారు. తనదైన స్టయిల్‌లో కౌంటర్‌ ఇచ్చారు. 

48

మనం ఇంకా మధ్య యుగంలో నివసిస్తున్నామా? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా? వారి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసి వస్తే అద్భుతం జరుగుతుంది కదా. నాదొక సలహా మీరంతా సంతోషంగా ఉండండి` అని తెలిపారు. మరోవైపు సుస్మితా సేన్‌ని వదల్లేదు ట్రోలర్స్. ఆమెని డబ్బు కోసం ఎంతపనికైనా దిగజారే(గోల్డ్ డిగ్గర్‌) అంటూ కామెంట్లు చేస్తున్నారు. తనపై వస్తోన్న ట్రోల్స్ పై సుస్మితా సేన్‌ కూడా రియాక్ట్ అయ్యింది. 

58

విమర్శలు చేస్తూ, మీమ్స్ తో రెచ్చిపోతున్న ట్రోలర్స్ పై ఆమె స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టిన సుస్మితా సేన్‌ ఘాటుగా కౌంటరిచ్చింది. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నట్టు తెలిపింది. తాను ఏం చేస్తున్నాననేది తన వ్యక్తిగతమని, తాత్కాలిక ప్రశంసల కోసం తాను బతకడం లేదని తెలిపింది. చుట్టూ ఉన్న ప్రపంచం దయనీయంగా మారిందని, అది చూస్తుంటే జాలేస్తుందని పేర్కొంది సుస్మితా సేన్. 
 

68

`నేను ఎప్పుడూ కలవని, అసలు పరిచయమే లేని మిత్రులు, కొంత మంది మేథావులు నా జీవితంపై హక్కు ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేనేం చేయాలో కూడా వారే చెబుతున్నారు. అంతేకాదు నన్ను `గోల్డ్ డిగ్గర్‌` అంటూ కామెంట్లు చేస్తున్నారు. నేను బంగారం కంటే డైమండ్స్ కే ప్రయారిటీ ఇస్తాను. వాటిని సొంతంగా కొనుక్కోగలను కూడా. ఇప్పటికైనా మీకు అర్థమైందనుకుంటున్నా.

78

ఈ సందర్భంగా మీరు ఒక విషయం తెలిసుకోవాలి. మీ సుష్‌ బాగానే ఉందని తెలుసుకోండి. ఇన్ని రకాల విమర్శలు వస్తున్నా కూడా నాకు సపోర్ట్ చేస్తున్నా, అండగా నిలుస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు` అంటూ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చింది. నిర్మొహమాటంగా ఇవ్వాల్సిన వారికి ఝలక్‌ ఇచ్చింది. తన లైఫ్‌ తనిష్టమనే విషయాన్ని స్పష్టం చేసింది సుస్మితా సేన్‌. 

88

ఇక ప్రస్తుతం లలిత్‌ మోడీ, సుస్మితాసేన్‌ డేటింగ్‌లోనే ఉన్నారని, అన్ని కుదిరి, కాలం కలిసి వస్తే పెళ్లి ముచ్చట కూడా తీర్చుకుంటామని తెలిపారు లలిత్‌ మోడీ. అయితే ఈ ఇద్దరు గత పదేళ్లుగా టచ్‌లోనే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇన్నాళ్లకు జోడీ కుదిరినట్టు బాలీవుడ్‌ మీడియాలో వినిపిస్తున్న టాక్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories