అయితే మరలా ఆమెకు కుమారి 21ఎఫ్ రేంజ్ హిట్ పడలేదు. అనూహ్యంగా టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్ మూవీ చేసింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆ చిత్రం అట్టర్ ప్లాప్. ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది.
ఒక దశలో హెబ్బా నటన మానేస్తున్నారా? అనే సందేహాలు కలిగాయి. హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోవడంతో హెబ్బా బరువు పెరిగింది. పూర్తిగా షేప్ అవుట్ అయ్యింది. రెడ్ మూవీలో ఐటెం నంబర్ చేసిన హెబ్బా లుక్ ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.