చీరకట్టుకే అందం తెచ్చిన మౌనీరాయ్.. ట్రాన్స్ ఫరెంట్ శారీలో ‘నాగినీ’ భామ గ్లామర్ మెరుపులు

First Published | Oct 5, 2023, 11:45 AM IST

‘నాగినీ’ హీరోయిన్ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో అందాల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిస్తూ ఫిదా చేస్తోంది. తాజాగా చీరకట్టులో మెరిసి మంత్రముగ్ధులను చేసింది.
 

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ (Mouni Roy)  ‘నాగినీ’ డైలీ సీరియల్ తో దేశ శ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మరిన్ని టీవీ సీరియల్స్ తోనూ ఈ ముద్దుగుమ్మ బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది. అలా వచ్చిన గుర్తింపు తో సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. 
 

నటిగా, స్పెషల్ డాన్స్ లతోనూ వెండితెరపై మెరిసిన మౌనీ రాయ్ తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ లో ‘రన్’, ‘మేడ్ ఇన్ చైనా’, ‘రోమియో అక్బర్ వాల్తేర్’, గతేడాది ‘బ్రహ్మస్త్ర’ మూవీతో అలరించింది. నెగెటివ్ రోల్ లో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చింది.
 


ఇక సౌత్ నుంచి వచ్చిన భారీ బ్లాక్ బాస్టర్ మూవీ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’లోనూ నటించింది. అయితే హిందీ వెర్షన్ లో ఈ ముద్దుగుమ్మ స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. 

అయితే, రాయ్ గతేడాది దుబాయికి చెందిన బిజినెస్ మెన్ సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది. 2022 జనవరి 27న వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. మ్యారేజ్ కు ముందుకు మౌనీరాయ్ తరుచూ దుబాయిక్ వెళ్తూ ఉండేది. దీంతో ఆ దేశం యూఏఈ గోల్డెన్ వీసాను కూడా అందింది. 
 

ఇక పెళ్లి తర్వాత భర్తతో కలిసి మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఎక్కువ సమయం ఫ్యామిలీతోనే గడుపుతోంది. టూర్లు, వేకషన్లకు వెళ్తూ సందడి చేస్తోంది. ఈ మేరకు ఎప్పటికప్పుడు ఫొటోలను పంచుకుంటూనే వస్తోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్స్ లో ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ ను నెటిజన్లను ఆటకట్టుకుంటోంది. 

తాజాగా మౌనీ రాయ్ వైట్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో మెరిసింది. చీరకట్టుకే అందం తెచ్చింది ఆమె సొగసు. ట్రెడిషనల్ లుక్ లో మౌనీ రాయ్ గ్లామర్ మెరుపులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం మౌనీ రాయ్ హిందీలో రూపుదిద్దుకుంటున్న ‘The Virgin Tree మూవీలో నటిస్తోంది.
 

Latest Videos

click me!