తెలుగు హీరోయిన్స్ కి కాలం కలిసి రావడం లేదు. ఈ మధ్య కాలంలో ఒక్క లోకల్ బ్యూటీ స్టార్ కాలేదు. రమ్యకృష్ణ, రంభ, విజయశాంతి, రోజా,రాశి వంటి హీరోయిన్స్ తోనే ఆ వైభవం ముగిసింది.
26
Dimple Hayathi
దర్శక నిర్మాతలు తెలుగు అమ్మాయిలకు అసలు ఆఫర్స్ ఇవ్వడం లేదు. అంజలి, శ్రీదివ్య, బిందు మాధవి వంటి హీరోయిన్స్ ని టాలీవుడ్ లో పట్టించుకునేవారు లేక కోలీవుడ్ కి వెళ్లి సక్సెస్ అయ్యారు. వారిలానే హైదరాబాద్ బ్యూటీ డింపుల్ హయాతి నిరాదరణకు గురవుతున్నారు. ఆమెకు సినిమాలు రావడం లేదు.
36
Dimple Hayathi
డింపుల్(Dimple Hayathi) కి వచ్చిన అతిపెద్ద ఆఫర్ ఖిలాడి. రవితేజ(Raviteja)కు జంటగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. ఖిలాడి విజయం సాధిస్తే డింపుల్ కి మంచి బ్రేక్ వచ్చేది. కానీ ఖిలాడి డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ విషయంలో హీరో రవితేజకు డైరెక్టర్ కి గొడవలు జరిగాయి.
46
Dimple Hayathi
ప్రస్తుతం ఆమె తెలుగులో శ్రీవాస్ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. డింపుల్ కి తెలుగుతో పాటు తమిళ్ కూడా వచ్చు. ఆమె పేరెంట్స్ తెలుగు, తమిళ మూలాలకు చెందినవారు. దీంతో తమిళంలో కూడా అదృష్టం పరీక్షించుకుంటుంది.
56
Dimple Hayathi
`గల్ఫ్` చిత్రంతో తెలుగుతెరకి పరిచయమైంది డింపుల్. తొలి చిత్రంతో ఆకట్టుకున్నా, పెద్దగా గుర్తింపు రాలేదు. `అభినేత్రి 2`లోనూ మెరిసింది. కానీ `గద్దల కొండగణేష్` చిత్రంలో `జర్రా జర్రా` అంటూ సాగే ఐటెమ్ సాంగ్‌తో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. హాట్ అందాలతో పిచ్చెక్కించింది.
66
Dimple Hayathi
సరైన మూవీ పడితే డింపుల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఆమెను సరిగా దర్శక నిర్మాతలు వాడుకోవడం లేదనిపిస్తుంది. ఈ తరం సిల్క్ స్మితలా ఉన్న డింపుల్ హయాతి గ్లామర్ రోల్స్ కి బాగా సెట్ అవుతారు. ఆమెకు డాన్స్ లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది.