వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు నందమూరి అందగాడు బాలయ్య బాబు. సీనియర్ హీరోలలో ప్రస్తుతం బాలయ్యబాబు మాత్రమే హిట్ జోష్ లో ఉన్నాడు. హ్యాట్రిక్ హిట్ కొట్టడం మాత్రమే కాదు.. నెక్ట్స్ సినిమాల ప్లానింగ్ కూడా అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం మెగా డైరెక్టర్ బాబీతో మాస్ మసాలా సినిమా చేస్తున్న బాలయ్య నెక్ట్స్ మూవీపై కూడా గట్టిగా కన్నేశాడు.