పుష్ప 2 రీషూట్, ఆలస్యం కానున్న విడుదల..? పార్ట్ 3 కోసం సుకుమార్ అనూహ్య నిర్ణయం!

First Published | Jun 3, 2024, 9:44 AM IST

పుష్ప 2 విడుదల వాయిదా పడే సూచనలు కలవంటున్నారు. ఈ మేరకు చిత్ర వర్గాల్లో ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. మరి అదే కనుక జరిగితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు. 
 

Pushpa 2

పుష్ప 2 చిత్రం పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 ఆగస్టు 15న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు. 

పుష్ప 2 విడుదలకు రెండు నెలలకు పైగా సమయం ఉంది. ఇప్పటి నుండే ప్రమోషన్స్ షురూ చేశారు. రెండు సాంగ్స్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన రెండు సాంగ్స్ కి విశేష ఆదరణ దక్కింది. ఫస్ట్ సింగిల్ 'పుష్ప పుష్ప' యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టింది. 



అయితే పుష్ప 2 విడుదల వాయిదా పడే అవకాశం కలదంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఓ షాకింగ్ వాదన తెరపైకి వచ్చింది. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కోసం మరొక క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నాడట. సాధారణంగా ప్రతి సినిమాకు సుకుమార్ రెండు క్లైమాక్స్ లు షూట్ చేస్తాడట. వాటిలో బెటర్ అనుకున్నది జోడిస్తాడట. 


పుష్ప 2 కోసం కూడా సుకుమార్ రెండు క్లైమాక్స్ లు రాసుకున్నాడట. కాగా పుష్ప 3 కూడా చేయాలనే ఆలోచనలో ఉన్న సుకుమార్ మరో క్లైమాక్స్ షూట్ చేయాలి అనుకుంటున్నాడట. ఈ క్లైమాక్స్ పుష్ప 3కి లీడ్ ఇచ్చేదిగా ఉంటుందట. ఈ క్రమంలో పుష్ప 2 ప్రకటించిన విధంగా ఆగస్టు 15న విడుదల కాకపోవచ్చని అంటున్నారు. 

ఈ పుకారులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. కాగా 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి పుష్ప 2 సీక్వెల్. పార్ట్ 1 దాదాపు రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పుష్ప సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. 
 


పుష్ప 2లో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. శ్రీవల్లిగా మరోసారి ఆమె మెస్మరైజ్ చేయనుంది. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. సునీల్, అనసూయ, రావు రమేష్, జగపతిబాబు కీలక రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 
 

Latest Videos

click me!