సౌందర్య నాకు బాగా క్లోజ్, ఆమె చనిపోతే ఏడవాలనే రూల్ లేదు.. ఆ ఒక్క విషయం తట్టుకోలేకపోయా, జగపతి బాబు

Published : Jun 03, 2024, 09:54 AM IST

దురదృష్టవశాత్తు 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ఉన్న ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా మరణించారు.

PREV
16
సౌందర్య నాకు బాగా క్లోజ్, ఆమె చనిపోతే ఏడవాలనే రూల్ లేదు.. ఆ ఒక్క విషయం తట్టుకోలేకపోయా, జగపతి బాబు
Soundarya

తెలుగు చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటి సౌందర్య. మహానటి సావిత్రి తర్వాత ఆ తరహా హోమ్లీ ఇమేజ్ సొంతం చేసుకున్న నటి సౌందర్య అనే చెప్పొచ్చు. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, శ్రీకాంత్, జగపతి బాబు, వెంకటేష్ ఇలా తన తరం నటులతో సౌందర్య ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసింది. 

26
Soundarya

సోలో హీరోయిన్ గా కూడా రాణించింది. కానీ దురదృష్టవశాత్తు 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ఉన్న ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా మరణించారు. ఈ సంఘటన అభిమానులకు జీర్ణించుకోలేని విషాదం అయితే.. ఆమె కుటుంబ సభ్యులకు పిడుగులాంటిది. 

36

చిత్ర పరిశ్రమలో సౌందర్యతో బాగా క్లోజ్ గా ఉండే నటీనటులు చాలా మందే ఉన్నారు. అయితే సౌందర్యకి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆమని, జగపతి బాబు లాంటి వారి పేర్లు చెప్పొచ్చు. సౌందర్య జగపతి బాబు కలసి చాలా చిత్రాల్లో నటించారు. 

46

సౌందర్య మరణంపై ఆ మధ్యన ఇంటర్వ్యూలో జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సౌందర్య లాంటి క్లోజ్ ఫ్రెండ్ మరణించినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉండేది అని యాంకర్ ప్రశ్నించారు. జగపతి బాబు మాట్లాడుతూ.. నేను ఎక్కువగా ఫిలాసఫీ నమ్ముతాను. నా మైండ్ లో అది ఎక్కువగా ఉంటుంది. పుడతాం పోతాం అని అందరికి తెలుసు. 

56

జీవితంలో డబ్బు పోయినా ఇంకేమైనా పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. మనిషిని కోల్పోతే తిరిగి తీసుకురాలేం. ఆ విషయానికి తప్పకుండా బాధపడాలి. కానీ చనిపోయినప్పుడు ఏడవాలి అనేది రూల్ అయితే కాదు. ఆ వ్యక్తిని మిస్ అవుతున్నాం అనే బాధ ఉంటుంది. కానీ ఆ సమయంలో సౌందర్య మరణించింది అనే బాధ కంటే నేను ఎక్కువగా ఆలోచించిన విషయాలు ఉన్నాయి. 

66

సౌందర్య, ఆమె సోదరుడు అమర్ ఇద్దరూ చనిపోయారు. వాళ్ళ మదర్ పరిస్థితి ఏంటి ? అమర్ పిల్లల పరిస్థితి ఏంటి ? అతని భార్య పరిస్థితి ఏంటి ? వాళ్ళ ఇంట్లో జరిగిన ఆస్థి గొడవల పరిస్థితి ఏంటి ? నా మైండ్ మొత్తం ఈ విషయాల గురించే ఆలోచిస్తోంది. ఆమె చనిపోయినందుకు ఏడవలేదు కానీ వల్ల కుటుంబం పరిస్థితి విషయంలోనే బాధపడ్డట్లు జగపతి బాబు అన్నారు. 

click me!

Recommended Stories