టాలీవుడ్ నుంచి నెక్ట్స్ రాబోతున్న పెద్ద సినిమా గేమ్ ఛేంజర్. దాదాపు మూడేళ్లుగా రామ్ చరణ్ తో డైరెక్టర్ శంకర్ కుస్తీలు పట్టి.. సినిమాను ఓ కొలిక్కి తీసుకువచ్చారు. ఇక ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాయి.
అయితే ఈమద్య శంకర్ సినిమాలు ఏవీ వర్కౌట్ అవ్వడంలేదు. దాంతో ఒకింత అభిమానుల్లో ఆందోళన మాత్రం ఉంది. సినిమా ఏమౌతుందా అని. కాని అటు శంకర్ , ఇటు రామ్ చరణ్ ఈసినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలి అని చూస్తున్నారు.
ఈక్రమంలోనే గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో దిగబోతోంది. ఈసినిమాను జనవరి 10 ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు టీమ్. ఇప్పటిే ప్రమోషన్ల జోరు గట్టిగా ఉంది. రీసెంట్ గా అమెరికాలోని డల్లస్ లో గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఊహించని విధంగా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు భారీ ఎత్తున జనాలు హాజరయ్యారు.
Director Shankar
ఈ క్రమంలో ఓ విషయం శంకర్ ద్వారా తెలిసింది. అదేంటంటే..? డైరెక్టర్ శంకర్ కు ఇప్పుడంటే బ్యాడ్ టైమ్ నడుస్తుంది కాని.. ఒకప్పుడు శంకర్ సినిమాలకు ఎంత డిమాండ్ ఉండేదో అందరికి తెలిసిందే.
రాజమౌళికంటే ముందు పాన్ ఇండియాసినిమాలు, భారీ సినిమాల రుచి చూపించింది శంకరే. టాలీవుడ్ బాహుబలి తరువాత ఈ స్థాయికి చేరుకుంది కాని.. ఒకప్పుడు టాలీవుడ్ ను కోలీవుడ్ కాని, బాలీవుడ్ కాని లెక్కలోకి తీసుకునేవారు కాదు.
Director Shankar
అయితే జక్కన్న వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయింది. ఈ విషయం పక్కన పెడితే.. శంకర్ తమిళ హీరోలతో మాత్రమేభారీ సినిమాలు చేసేవారు. అవి డబ్ అయ్యి తెలుగులోకి వచ్చేవి. వారికి భాషాభిమానం ఎక్కువ కావడంతో ఇతర హీరోలతో సినిమాలు చేయలేదు శంకర్.
ఒక్క అనిల్ కపూర్ తో మాత్రమే హిందీలో ఒ సినిమా చేశారు. అది కూడా తమిళ రీమేక్ మూవీ. ఇక ఆతరువాత నాన్ తమిళ్ హీరోతో శంకర్ సినిమా చేయడం.. అది కూడా తెలుగు హీరో అయిన రామ్ చరణ్ తో సినిమా చేయడం ఇది మొదటి సారి.
ఇండియాన్ 2 డిజాస్టర్ అవ్వడంతో.. గేమ్ ఛేంజర్ పైనే ఆశలుపెట్టుకున్నాడు శంకర్. ఈమూవీతో మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే శంకర్ కు తెలుగు హీరో సెకండ్ లైఫ్ ఇచ్చినట్టే. అయితే విషయం ఏంటంటే.. శంకర్ ఇతర భాషా హీరోలతో సినిమాలు చేయడు అని అందరు అనుకుంటుంటే.. తాను మాత్రం తెలుగు హీరోలతో సినిమా కోసం చాలా సార్లు ప్రయత్నం చేశాను అంటున్నారు.
గేమ్ ఛేంజర ప్రీరిలీజ్ లో శంకర్ మాట్లాడుతూ.. తాను తెలుగులో ముగ్గురు స్టార్ హీరోలతో సినిమా చేయాలి అనుకున్నాను అన్నారు. మెగాస్టార్ చిరంజీవితో, ప్రభాస్ తో, మహేష్ బాబుతో ఇలా ముగ్గురితో విడిగా సినిమాలు చేసే ప్రయత్నం చేశారట శంకర్.
అంత కాదు ప్రభాస్ తో కథా చర్చలు కూడా జరిగాయట. కాని అవేవి వర్కౌట్ అవ్వలేదట. ఇక తనకు సినిమాచేయాలని రామ్ చరణ్ తో రాసి పెట్టి ఉంది. అది జరిగింది అన్నారు శంకర్. ప్రస్తుతం శంకర్ మాటలు వైరల్ అవుతున్నాయి. మరి గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏమౌతుందో చూడాలి.