అంజలీ హీరోయిన్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి...తెలుగు పిల్ల తమిళంలో సెన్సేషన్ గా మారింది. కోలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్ గా మారి.. తరువాత తెలుగులో అడుగు పెట్టిన అంజలి..జర్నీ సినిమాతో రెండు భాషల్లో బాగా పాపులర్ అయ్యింది. ఆతరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. సినిమా ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యింది.
ఈక్రమంలో అంజలికి హీరోయిన్ రోల్స్ తగ్గడంతో.. సెకండ్ హీరోయిన్ గా.. మరియు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి పాత్రలతోనే ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది బ్యూటీ. అంతే కాదు ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తూ.. దుమ్ము రేపేస్తోంది.
ఈక్రమంలో అంజలి వాలెంటైన్స్ డే పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంట్లో సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంది. తన పెట్ తో కలిసి లవ్ షేప్ ఉన్న సింబల్స్ ను పెడుతూ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ చాలా క్యాజువల్ వేర్ లో సింపుల్ గా బెలూన్ లతో తన లవ్ ను బయట పెట్టింది అంజలీ. అయితే అతనెవరు అనేది మాత్రం వెల్లడించలేదు.
క్యాజ్యువల్ గా అలా చెప్పిందా..? లేక ఎవరైనా ఉండి.. బయటకు చెప్పడం ఇష్టం లేక అలా సింగిల్ గా సెలబ్రేట్ చేసినట్టు కవరింగ్ ఇచ్చిందా అనేది మాత్రం తెలియడంలేదు. అయితే గతంలో మాత్రం తమిళ యంగ్ స్టార్.. జర్నీ ఫైమ్ జైతో అంజలి ప్రేమాయనం రచ్చ రచ్చ అయిన సంగతి తెలిసిందే..?
ఈక్రమంలో అంజలి మరోసారి ప్రేమలో పడిందంటున్నారు నెటిజన్లు. కాని అంజలి మాత్రం ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. వరుస సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా గడిపేస్తుంది బ్యూటీ.. మరి ప్రేమ వ్యవహారం నిజం అయితే ఎప్పుడు బయట పెడుతుందో చూడాలి.
ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో కూడా ఫుల్ బిజీ అయిపోయింది అంజలి. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. దీనితో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడానటిస్తూ.. హాడావిడిచేస్తోంది.