సంప్రదాయ వస్త్రాల్లో కట్టిపడేస్తున్న మలయాళీ అందం.. యంగ్ బ్యూటీ అదొక్కటి మిస్ చేసిందంట!

First Published | Feb 15, 2023, 6:15 PM IST

మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్  (Priya Prakash Varrier) బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా తన అభిమానులతో పంచుకున్న ఫొటోస్ ఫ్యాన్స్ ను కట్టిపడేస్తున్నాయి. 
 

కన్నుగీటు వీడియోతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మలయాళ భామ, యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇటీవల సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తున్నారు. వరుస ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నారు. 
 

ఓపైపు ట్రెండీ వేర్స్ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూనే.. మరోవైపు ట్రెడిషనల్ వేర్స్ లో దర్శనమిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. రీసెంట్ గా మహారాణిలా ముస్తాబవుతూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా కట్టిపడేస్తున్నారు. 
 


తాజాగా పట్టువస్త్రాలు, సంప్రదాయ ఆభరణాలు ధరించారు. దీంతో ప్రియా మరింత అందంగానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వరుసగా ఫొటోషూట్లు చేస్తుండటంతో కుర్రకారు మంత్రముగ్ధులవుతున్నారు.
 

ప్రియా ప్రకాశ్ అందానికి ఫ్యాన్స్ నెటిజన్లు ఫిదా అవుతూ ఫొటోలపై కామెంట్లు కూడా పెపడుతున్నారు. తాజాగా  ఫొటోషూట్ లో పట్టువస్త్రాలు, ఆకర్షణీయమైన ఆభరణాలు ధరించిన ప్రియా.. చేతులకు మెహందీ కూడా పెట్టి ఉంటే.. మరింత అందంగా కనిపించే వారిని ఆమె అభిమాని ఒకరు అభిప్రాయపడ్డారు. 
 

యంగ్ బ్యూటీ తాజా ఫొటోషూట్ కు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ తరహాలో వెండితెరపైనా తనను చూసేందుకు ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యంగ్ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

ప్రియా కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు ఆరేడు చిత్రాల్లో నటిస్తున్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. బాలీవుడ్ లోనే ఏకంగా నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. కన్నడలో ఒక చిత్రం, మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. 

Latest Videos

click me!