కొందరు పాములను చూస్తేనే పరుగు పెడతారు. అలాంటిది అనన్య పాండే మాత్రం వాటితో ఆడుకుంటూ షాక్ ఇచ్చింది. కొండ చిలువలను చేతిలోకి తీసుకుని ఫోటోలకు పోజిచ్చింది. అనన్య పాండే డేరింగ్ చేసి అందరూ భేష్ అంటున్నారు. కామెంట్స్ రూపంలో ఆమెను పొగిడేస్తున్నారు.
28
Ananya Panday
అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. గత ఏడాది విడుదలైన లైగర్ చిత్రంలో ఆమె నటించారు. విజయ్ దేవరకొండకు జంటగా గ్లామరస్ రోల్ లో అలరించింది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
38
Ananya Panday
లైగర్ పై అనన్య చాలా ఆశలే పెట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో జెండా పాతాలన్న ఆమె కల నెరవేరలేదు. లైగర్ అనంతరం తెలుగులో అనన్యకు ఆఫర్స్ రాలేదు. బాలీవుడ్ లో మాత్రం వరుస చిత్రాలు చేస్తుంది. అక్కడ స్టార్ గా ఎదిగే ప్రయత్నం చేస్తుంది.
48
నటుడు చంకీ పాండే కూతురైన అనన్య పాండే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో పరిశ్రమలో అడుగుపెట్టింది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. దర్శకుడు పునీత్ మల్హోత్రా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు.
58
Ananya Panday
అనన్య పాండే బక్క పలుచగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె బాడీ షేమింగ్ కి గురయ్యారట. తన శరీరం మీద పలువురు జోక్స్ వేశారని ఓ సందర్భంలో ఆమె అన్నారు. ముఖ్యంగా ఫ్లాట్ చెస్ట్ అంటూ అనన్య పాండేను వేధించారట. తనకు కూడా బాడీ షేమింగ్ తప్పలేదని అనన్య చెప్పుకొచ్చింది.
68
హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ఎఫైర్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను అనన్య పాండే తండ్రి ఖండించారు. నటుల మీద ఇలాంటి పుకార్లు కామన్. అందులో వాస్తవం లేదన్నారు. అయితే ఇటీవల అనన్య పాండే సోషల్ మీడియా పోస్ట్ మరోసారి పుకార్లకు కారణమైంది.
78
ఆదిత్య రాయ్ కపూర్ జన్మదినం సందర్భంగా అనన్య ఒక అన్ సీన్ పిక్ పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. ఈ విధంగా ఆదిత్య కపూర్ తో అనన్య తన ప్రేమను వ్యక్తీకరించిందంటూ కథనాలు వెలువడ్డాయి.
88
Ananya panday
ఆదిత్య రాయ్ కపూర్ జన్మదినం సందర్భంగా అనన్య ఒక అన్ సీన్ పిక్ పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. ఈ విధంగా ఆదిత్య కపూర్ తో అనన్య తన ప్రేమను వ్యక్తీకరించిందంటూ కథనాలు వెలువడ్డాయి.