టాలీవుడ్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) తాజాగా కొన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఇండియాలోనే బుట్టబొమ్మ గతంలో తన వెకేషన్ కు సంబంధించిన గ్లామర్ పిక్స్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.
ఆ మధ్యలో ప్రణీత కొలంబోకు వెళ్లింది. ఈ సందర్భంగా ఓ రిసార్ట్ లో తెగ ఎంజాయ్ చేసింది. పొట్టి డ్రెస్ లో ప్రణీత ఇచ్చిన ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అయ్యేలా చేసింది. మరోవైపు థైస్ షోతోనూ మంట పెట్టేసింది.
ఇక లెహంగా, బ్లాక్ టాప్ లోనూ కొన్ని మత్తెక్కించే ఫోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది. స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది. గ్లామర్ విందుతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంది.
ఇటీవల ప్రణీతా కిల్లింగ్ లుక్స్ లో దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేసి గ్లామర్ విందు చేసింది. లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే మరోవైపు అందాల ప్రదర్శనతో అదరగొడుతూ వచ్చింది.
ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులు లైక్స్ తో వైరల్ చేస్తున్నారు. బుట్టబొమ్మ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. క్రేజీగా కామెంట్లు పెడుతూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.
మొదటి లాక్ డౌన్ లో ఈ ముద్దుగుమ్మ పెళ్లి వ్యాపారి నితిన్ రాజ్ తో జరిగిన విషయం తెలిసిందే. గతేడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ Dileep 148లో నటిస్తోంది.