స్టార్ హీరోయిన్ అమలాపాల్ Amala Paul ప్రస్తుతం గర్భంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుస తన గురించి అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. తాజాగా పంచుకున్న వీడియో మాత్రం ఆందోళనకరంగా మారింది.
టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయమే. రామ్ చరణ్ ‘నాయక్’, ‘ఆమె’, ‘పిట్ట కథలు’ వంటి చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే.
26
హీరోయిన్ గా వెండితెరపై అలరించడమే కాకుండా ఆయా వెబ్ సిరీస్ లు, ఓటీటీ ఫిల్మ్స్ ల్లో బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకుంది. విభిన్న పాత్రలు పోషించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
36
ఇదిలా ఉంటే.. అమలా పాల్ కొన్నాళ్లుగా సినిమాల కంటే తన పర్సనల్ విషయాలనూ షేర్ చేసుకుంటూనే అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఈ క్రమంలో తన పెళ్లి వార్తను చెప్పి సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే.
46
అమలాపాల్ గతేడాది రెండో పెళ్లి చేసుకుంది. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ (Jagat Desai) తో 2023 నవంబర్ 5న వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఆ కొద్ది రోజులకే తన ప్రెగ్నెన్సీని కూడా అనౌన్స్ చేసింది.
56
ఇలా బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు చెప్పి తన అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. గర్భవతిగా తన ఆరోగ్యం గురించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. బెబీ బంప్ ఫొటోలను షేర్ చేసుకుంటూ.. భర్తతో సమయం గడుపుతూ కనిపిస్తోంది. అయితే తాజాగా మాత్రం ఏడు నెలల గర్భంతో అమలాపాల్ ఓ పబ్ లో డాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.
66
భర్తతో కలిసి స్టెప్పులు వేయడంతో నెటిజన్లు ఆందోళన పడుతున్నారు. ‘యువతకు మీరిచ్చే సందేశం ఇదేనా?’ అంటున్నారు. కాస్తా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం కపుల్ గోల్స్ అంటూ వారిని సమర్థిస్తున్నారు. మొత్తానికి ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.