యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడి, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ ఇప్పుడిప్పుడే స్టార్ హీరో దిశగా అడుగులు వేస్తున్నారు.
26
ఈ క్రమంలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఏదో క్వాంటిటీ కోసం కాకుండా క్వాలిటీ ఉన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆడియెన్స్ మెచ్చే సినిమాలు తీసుకున్నారు.
36
చివరిగా ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ (Baby The Movie) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎంతలా ఆడియెన్స్ ను ఆకట్టుకుందో తెలిసిందే.
46
ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల వరకు వసూల్ చేసింది. అయితే ఆనంద్ రెమ్యునరేషణ్ ఎంత తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది.
56
బేబీ సినిమాకు మాత్రం ఆనంద్ రూ.80 లక్షల వరకు తీసుకున్నారని టాక్. ఇప్పుడు సక్సెస్ జోరులో ఉండటంతో రూ.కోటికి పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
66
అయితే మనోడి స్పీడ్ చూస్తే మాత్రం త్వరలోనే స్టార్ హీరోగా మారిపోతాడని అంటున్నారు. ఇక నెక్ట్స్ సమ్మర్ లో ‘గంగం గణేశా’ చిత్రంతో అలరించబోతున్నారు. తాజాగా ‘డ్యుయెట్’ అనే కొత్త సినిమా టైటిల్ పోస్టర్ ను రివీల్ చేశారు.