పెళ్లంటే చిర్రుబుర్రు లాడుతున్న నటి వరలక్ష్మి... స్ట్రాంగ్ వార్నింగ్!

First Published Mar 8, 2021, 3:00 PM IST

స్టార్ కిడ్ వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాపై ఫైర్ అయ్యారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె కోపంతో చిర్రెత్తి పోయారు. ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగకండి అంటూ కోపంతో ఊగిపోయారు. 
 

సౌత్ ఇండియాలో బిజీ యాక్ట్రెస్ గా వరలక్ష్మీ ఉన్నారు. తాను విజయ్ సేతుపతికి లేడీ వర్షన్ అని చెప్పుకుంటున్న వరలక్ష్మీ, నిజంగా విలక్షణ పాత్రలు చేస్తున్నారు.
undefined
తెలుగులో కూడా వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్న వరలక్ష్మీ ఇటీవల విడుదలైన నాంది, క్రాక్ చిత్రాలలో కీలక రోల్స్ చేశారు. ఎన్టీఆర్, బన్నీ చిత్రాలలో కూడా వరలక్ష్మీ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.
undefined
తమిళ, కన్నడ బాషలలో కలిపి అరడజనుకు పైగా సినిమాలు వరలక్ష్మీ చేతిలో ఉన్నాయి. నటిగా జెట్ స్పీడ్ తో వెళుతున్న ఆమెను, ఓ పర్సనల్ క్వచ్చన్ బాగా ఇబ్బంది పెడుతుంది.
undefined
అదే మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? తాజాగా వరలక్ష్మీకి ఈ ప్రశ్న ఎదురుకావడంతో, అడిగిన వారిపై ఫైర్ అయ్యారు. ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగకండి అని ఘాటు సమాధానం చెప్పారు.
undefined
అందరూ పెళ్లి చేసుకోవాలని ఎక్కడైనా రాసి పెట్టి వుందా? ప్రతి సారి పెళ్లి గురించి ఎందుకు అడుగుతున్నారని వరలక్ష్మీ గట్టిగా మాట్లాడారు. వరలక్ష్మీ ప్రస్తుత వయసు 36ఏళ్ళు దీనితో ఆమెపై పెళ్లి వత్తిడి పెరిగిపోయింది.
undefined
ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ హీరో విశాల్ తో చాలా కాలం ప్రేమాయణం నడిపారు. దాదాపు వీరి పెళ్లి ఖాయమే అని వార్తలు రావడం జరిగింది. అనూహ్యంగా ఈ జంట విడిపోవడం జరిగింది.
undefined
నడిగర్ సంఘం ఎన్నికల విషయంలో విశాల్... శరత్ కుమార్, రాధికా మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ గొడవల తరువాత వీరి మధ్య దూరం మరింతగా పెరిగిపోయింది.
undefined
click me!