నా ఎదపై సీక్రెట్ టాటూ మీనింగ్ అదే... ఎవరికీ తెలియని పర్సనల్స్ పంచుకున్న అనసూయ!

First Published Mar 8, 2021, 2:04 PM IST

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఉమెన్స్ డే నాడు ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తన ఫ్యాన్స్ అడిగిన అనేక వ్యక్తిగత విషయాలకు సమాధానం చెప్పారు. ఓ ఫ్యాన్స్ అనసూయ వంటిపై ఉన్న టాటూల గురించి అడుగగా... ఆ సీక్రెట్ డీటెయిల్స్ వివరించారు. 
 

సినిమాలు, టీవీ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉండే అనసూయ కొంచెం ఖాళీ సమయం దొరికినా... తన యూట్యూబ్ ఛానల్ పై ఫోకస్ పెడతారు. తాజాగా ఫ్యాన్స్ తనని అడిగిన 30ప్రశ్నలకు సమాధానం చెవుతూ స్పెషల్ వీడియో చేశారు.
undefined
ఓ అభిమాని మీ వంటిపై ఎన్ని టాటూలు ఉన్నాయని అడిగారు. దానికి సమాధానంగా అనసూయ తన శరీరంపై రెండు టాటూలు ఉన్నాయని చెప్పడమే కాకుండా వాటి అర్థాలు, సందర్భాలు వివరించారు.
undefined
మొదటగా తన యదపై నిక్కూ అనే టాటూ ఉంది. అది మా ఆయన ముద్దు పేరు. భరద్వాజ్ తో ఎంగేజ్మెంట్ జరిగిన ఏడాదిన్నర తరువాత మా వివాహం జరిగింది. మా ఎంగేజ్మెంట్ కూడా భరద్వాజ్ బర్త్ డే రోజు జరిగింది.
undefined
ఎంగేజ్మెంట్ యానివర్సరీ గుర్తుగా భర్త ముద్దు పేరు నిక్కూ... ఎదపై టాటూగా వేయించుకున్నాను అన్నారు. ఎడమ చేతి రిస్ట్ వద్ద అనసూయకు మరో టాటూ ఉంది. దాని అర్థం గ్రీక్ మైథాలజీలో 'బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం ముఖ్యం' అని అనసూయ తన టాటూల సీక్రెట్స్ వివరించారు.
undefined
ఇక తనకు పొట్ట, బట్ట అంటే చాలా భయం అన్నారు అనసూయ. అలాగే డబ్బులు వెజిటబుల్స్ కొనడానికి, పిల్లల కోసం, భర్త కోసం షాపింగ్ చేయడానికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాను అన్నారు.
undefined
తనకు నచ్చని కాంప్లిమెంట్ ఏంటని అడుగగా... మీకు ఇద్దరు పిల్లలా, అసలు అలా కనిపించడం లేదని కొందరు అంటారు. అది నాకు నచ్చదు, అమ్మ అయినంత మాత్రాన అందంగా ఉండకూడదు, అనే అభిప్రాయం నాకు నచ్చదు అన్నారు అనసూయ.
undefined
సోషల్ మీడియా ట్రోల్స్ పై కూడా స్పందించారు అనసూయ. కొందరు సన్నిహితులు ట్రోల్స్ పట్టించుకోకు అంటారు. కానీ నేను మాత్రం అసలు తగ్గేది లేదని, సమాధానం ఇవ్వాల్సిందే అన్నారు.
undefined
వైన్, కాఫీ ఏది ఇష్టం అంటే... కాఫీ లేకుండా అసలు ఉండలేను. వైన్ పార్టీ కల్చర్ వలన అప్పుడప్పుడూ తప్పడం లేదన్నారు ఆమె.
undefined
ఇక ఆడవాళ్ళలో హానెస్టీ నచ్చుతుందని, ఆడదానిగా అమ్మతనం ఎంతో ఇష్టపడతానని అనసూయ అన్నారు.
undefined
అలాగే మ్యారేజ్ యానివర్సరీ వేడుకకోసం మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు చిన్న ప్రమాదానికి గురయ్యానని అనసూయ తెలియజేశారు. ఇలాంటి 30 వ్యక్తిగత ప్రశ్నలకు అనసూయ సమాధానం చెప్పారు.
undefined
click me!