శ్రుతి హాసన్ కి ఏమైంది...ఫ్యాన్స్ ని తికమక పెడుతున్న స్టార్ హీరోయిన్!

First Published | Oct 24, 2021, 1:02 PM IST

హీరోయిన్ శృతి హాసన్ కొన్నాళ్ళుగా చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు, కామెంట్స్ విభిన్నంగా ఉంటున్నాయి. అసలు Shruti haasan ప్రస్తుత మానసిక స్థితి ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. 
 

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 


ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ ఫ్యాన్స్ కి ఏమి చెప్పాలని అనుకుంటున్నారో తెలియని పరిస్థితి. తనకు తోచిన ఆలోచనను ఇంస్టాగ్రామ్ లో ఆలోచనగా పెట్టేస్తున్నారు. ఆమె కామెంట్స్ కి అర్థం ఏమిటో తెలియక ఫ్యాన్స్ జుట్టు పట్టుకుంటున్నారు. 


శృతి హాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో రిలేషన్షిప్ నడుపుతున్నారు.  ఆమె తన కొత్త రిలేషన్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముంబై కి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ఆమె డేటింగ్ చేస్తున్నారు.

ముంబైలో వీరిద్దరూ కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. బోల్డ్ యాటిట్యూడ్ కలిగిన శృతి అతనితో ఓపెన్ గానే తిరిగేస్తుంది. ఇద్దరూ ఒకే చోట ఉంటూ, తింటూ సహచర్యాని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి ఫోటోలు శృతి హాసన్ ఎప్పటికప్పుడూ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. తమ మధ్య ఉన్న అపరిమితమైన ప్రేమను చాటుకుంటున్నారు. 

కాగా గతంలో శృతి లండన్ కి చెందిన మైఖేల్ కోర్ల్సే తో ప్రేమాయణం సాగించారు. వీరి మధ్య బలమైన ప్రేమ బంధం నడిచింది. పలుమార్లు చెన్నైలోని కమల్ ఇంటికి మైఖేల్ రావడం జరిగింది. దాదాపు వీరి పెళ్లి ఖాయమే అని అందరూ భావించారు. 


అయితే అనూహ్యంగా 2019లో శృతి, మైఖేల్ బ్రేకప్ అయ్యారు. ఈ విషయం శ్రుతిని కృంగదీసింది. మైఖేల్ ప్రేమ కోసం ఫీక్స్ లో ఉన్న కెరీర్ ని కూడా శృతి త్యాగం చేస్తే, అతడు మాత్రం హ్యాండ్ ఇచ్చాడు. బ్రేకప్ తరువాత లండన్ లోనే కొన్నాళ్ళు గడిపిన శృతి, లైవ్ మ్యూజిక్ షోలలో పాల్గొన్నారు. 
 


శృతి హాసన్ శాంతను బంధం ఫెవికాల్ అంత ధృడంగా ఉంది. మరి ఈ రిలేషన్ అయినా పెళ్లి వరకు వెళుతుందో లేక మధ్యలోనే ముగుస్తుందో చూడాలి; ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం సలార్ లో శృతి హీరోయిన్ గా నటిస్తుండగా,Salaar చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. 

Also read వైరల్ వీడియో... జిమ్ లో చెమటలు చిందిస్తున్న రష్మిక, దాని కోసం ఎంత కష్టపడుతుందో

Also read మెగా మనసుని చాటుకున్న చిరంజీవి.. అభిమానికి వైద్య ఖర్చులు మొత్తం..

Latest Videos

click me!