హౌస్ లో ప్రియాంక, కాజల్, ప్రియా, రవి, అని, షణ్ముఖ్ లు డూపులుగా చెబుతాడు లోబో. మిగిలిన ఆరుగురు మానస్, సన్నీ, విశ్వ, శ్రీరామ్, సిరి, జెస్సి తోపులుగా చెబుతాడు. లోబో ఎవరి గురించి ఎలా చెప్పినా పెద్దగా ఆశ్చర్యం లేదు.. కానీ రవిని డూపుగా పరిగణించడం అందరికి షాక్ ఇచ్చే అంశమే. రవి, లోబో ఫ్రెండ్ షిప్ గురించి అందరికి తెలిసిందే. కానీ రవిని డూపుగా ఎందుకు చెప్పానో వివరణ ఇస్తాడు లోబో. రవికి తాను అవసరమైనప్పుడు మాత్రమే గుర్తుకు వస్తానని అంటాడు.ఇందంతా టివిలో చూస్తున్న రవి ఒకింత ఆశ్చర్యానికి గురవుతాడు.